5. డెఫీ స్మార్ట్ఫోన్ను 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ వెర్షన్లో రూపొందించారు. మైక్రో ఎస్డీ కార్డుతో మెమొరీని పొడిగించుకోవచ్చు. ఇందులో 6.5 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటక్షన్ ఉంటుంది. దీంట్లో క్వాల్కోమ్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ ఉంటుంది. (image: motorolarugged.com)
6. మోటోరోలా డెఫీ వెనుకవైపు మూడు కెమెరాలు ఉంటాయి. 48 ఎంపీ ప్రధాన కెమెరా కాగా, మిగిలిన రెండు 2 ఎంపీ సెన్సర్లు. అందులో ఒకటి డెప్త్ సెన్సర్, రెండో మాక్రో సెన్సర్. ముందువైపు సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా ఉంటుంది. ధర చూస్తే... 329 యూరోలు. మన కరెన్సీ ప్రకారం సుమారు ₹29 వేలు. అయితే ఈ మొబైల్ మనకు ఎప్పుడొస్తుంది, ధర ఎంత ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది. (image: motorolarugged.com)
7. ఈ మొబైల్ గురించి మోటోరోలా తన బ్లాగ్లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ప్రపంచంలో 34 శాతం మంది వినియోగదారులు స్మార్ట్ఫోన్ డ్యామేజీ సమస్యతో బాధపడుతున్నారట. దైనందిన జీవితంలో వచ్చే ఫ్రస్టేషన్ల వల్ల ఇలా డ్యామేజీ అయిపోతున్నాయట. అలాంటివారికి ఈ మొబైల్ బాగా ఉపయోగపడుతుందని మోటోరోలా చెబుతోంది. (image: motorolarugged.com)