2. మోటో జీ82 5జీ రెండు వేరియంట్లలో లభిస్తోంది. రిలీజ్ ధరలు చూస్తే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,499 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999. ప్రస్తుతం రూ.1,500 ధర తగ్గగా 6జీబీ+128జీబీ వేరియంట్ రూ.19,999 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్ రూ.21,499 ధరకు లభిస్తోంది. (image: Motorola India)
3. ఫ్లిప్‌కార్ట్‌లో మోటో జీ82 5జీ స్మార్ట్‌ఫోన్ కొనేవారికి పలు ఆఫర్స్ ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈఎంఐ ద్వారా కొంటే రూ.704 ఈఎంఐ చెల్లిస్తే చాలు. రూ.19,300 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. మిటియోరైట్ గ్రే, వైట్ లిల్లీ కలర్స్‌లో కొనొచ్చు. (image: Motorola India)
4. మోటో జీ82 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ, పోకో ఎక్స్4 ప్రో 5జీ, రెడ్మీ నోట్ 11 ప్రో+, వివో టీ1, రియల్మీ 9 ప్రో, మోటో జీ71 స్మార్ట్ఫోన్లలో కూడా ఉంది. (image: Motorola India)
5. మోటో జీ82 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 30వాట్ టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. (image: Motorola India)
6 మోటో జీ82 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజైంది. మెమొరీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. కనెక్టివిటీ విషయానికి వస్తే 13 5జీ బ్యాండ్స్ సపోర్ట్, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 3.5 ఎంఎం జాక్, డాల్బీ ఆట్మాస్ సపోర్ట్, డ్యూయెల్ స్టీరియో స్పీకర్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Motorola India)