1. మోటోరోలా ఇండియా గతేడాది జీ సిరీస్‌లో పలు మొబైల్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా మోటో జీ52 (Moto G52) మొబైల్ కూడా గతేడాది లాంఛ్ అయింది. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ ధర భారీగా తగ్గింది. గతేడాది రూ.20,000 లోపు బడ్జెట్లో రిలీజైన ఈ మొబైల్‌ను ఇప్పుడు రూ.9,999 ధరకే కొనొచ్చు. (image: Motorola India)
2. మోటో జీ52 రెండు వేరియంట్లలో లభిస్తోంది. రిలీజ్ ధరలు చూస్తే 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,499. ఇప్పుడు ఈ రెండు వేరియంట్లపై రూ.3,500 వరకు ధర తగ్గింది. దీంతో 4జీబీ+64జీబీ వేరియంట్ రూ.10,999 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్ రూ.12,999 ధరకు లభిస్తోంది. (image: Motorola India)
3. ఫ్లిప్‌కార్ట్‌లో మోటో జీ52 కొనేవారికి బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఆఫర్స్‌తో మరో రూ.1,000 వరకు తగ్గింపు పొందొచ్చు. ఈ ఆఫర్స్‌తో మోటో జీ52 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.9,999 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.11,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈఎంఐ ఆఫర్స్ రూ.387 నుంచి ప్రారంభం అవుతాయి. (image: Motorola India)
4. మోటో జీ52 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ pOLED డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగ్న్ 680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ రెడ్మీ 10 పవర్, రియల్మీ 9 4జీ, ఒప్పో కే10, రెడ్మీ 10, రెడ్మీ నోట్ 11, వివో వై33టీ, రియల్మీ 9ఐ స్మార్ట్ఫోన్లలో ఉంది. (image: Motorola India)
5. మోటో జీ52 స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 8మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. రియర్ కెమెరాలో డ్యూయెల్ క్యాప్చర్, స్మార్ట్ కంపోజిషన్, స్పాట్ కలర్, లైవై మోటో, ప్రో మోషన్, అల్ట్రావైడ్ డిస్టార్షన్ కరెక్షన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. (image: Motorola India)
6. మోటో జీ52 స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మెమొరీ కార్డుతో 1టీబీ స్టోరేజ్ పెంచుకోవచ్చు. డాల్బీ అట్మాస్ స్పీకర్స్, ఫేస్ అన్‌లాక్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 అప్‌గ్రేడ్‌తో పాటు మూడేళ్లపాటు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి. (image: Motorola India)