ఇండియాలో 5G సేవలు క్రమంగా ప్రధాన నగరాలకు వ్యాపిస్తున్నాయి. ఇప్పుడు మొబైల్ కంపెనీలు బడ్జెట్ రేంజ్లో 5G స్మార్ట్ఫోన్లు లాంచ్ చేయడంపై దృష్టి సారించాయి. ఇప్పటికే ఈ సెగ్మెంట్లో చాలా మొబైల్స్ మార్కెట్లోకి వచ్చాయి. తాజాగా మోటోరోలా కంపెనీ మోటో G53 5G పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది.
త్వరలో ఈ మోడల్స్‌ను ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. 120Hz డిస్ప్లే, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ వంటి ఫీచర్స్‌తో వచ్చిన ఈ హ్యాండ్సెట్, గతంలో లాంచ్ అయిన మోటో G52కు సక్సెసర్‌గా వచ్చింది. ఇప్పుడు మోటోరోలా మోటో G53 ధర, స్పెసిఫికేషన్స్ వివరాలను పరిశీలిద్దాం.
స్పెసిఫికేషన్స్ .. బడ్జెట్ రేంజ్ మోటో G53 స్మార్ట్‌ఫోన్ 720p రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల LCD డిస్ప్లేతో లభించనుంది. ఇది 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ చిప్సెట్ ద్వారా రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ MyUI 5.0తో పని చేస్తుంది.
డ్యుయల్ రియర్ కెమెరా సెటప్
ఫోన్ వెనుక భాగంలో డ్యుయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50MP మెయిన్ సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్ ఉంటాయి. అయితే మునుపటి మోడల్ Moto G52లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. మోటో G53 ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్ప్లాష్-రెసిస్టెంట్ డిజైన్‌తో కూడా వస్తుంది.
సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్
ఈ హ్యాండ్ సెట్లో 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీ ఉంటుంది. సెక్యూరిటీ పరంగా సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది. ఆడియో కోసం 3.5mm హెడ్‌ఫోన్ జాక్, ఛార్జింగ్- డేటా ట్రాన్స్ఫర్ ప్రయోజనాల కోసం USB టైప్-C పోర్ట్ వంటి అదనపు ఫీచర్స్ ఇందులో ఉన్నాయి
త్వరలోనే చైనా మార్కెట్లో మోటో G53 స్మార్ట్‌ఫోన్స్ అందుబాటులోకి రానున్నాయి. అయితే ఏ తేదీ నుంచి సేల్స్ మొదలవుతాయో కంపెనీ స్పష్టత ఇవ్వలేదు. మోటో G53 బడ్జెట్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో ఎప్పుడు లాంచ్ అవుతుందో కంపెనీ ఇంకా ప్రకటించలేదు. మోటోరోలా కంపెనీ చైనాలో మోటో G53ను లాంచ్ చేసిన సమయంలోనే, Moto X40ను కూడా లాంచ్ చేయడం గమనార్హం.