1. మోటరోలా ఇండియా నుంచి ఇటీవల మోటోరోలా ఎడ్జ్ 30 (Motorola Edge 30) మొబైల్ రిలీజైంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే యూరప్ మార్కెట్లో రిలీజైంది. ఇటీవల భారతదేశానికి వచ్చింది. ఇండియాలో ఇప్పటికే మోటోరోలా ఎడ్జ్ 30 ప్రో (Motorola Edge 30 Pro) మార్కెట్లో ఉంది. పవర్ఫుల్ ప్రాసెసర్‌తో మోటోరోలా ఎడ్జ్ 30 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కావడం విశేషం. (image: Motorola India)
2. మోటోరోలా ఎడ్జ్ 30 స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ+ (Qualcomm Snapdragon 778G+) ప్రాసెసర్ ఉంది. ఇండియాలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో రిలీజైన స్మార్ట్‌ఫోన్స్ అన్నీ పాపులర్ అయ్యాయి. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ+ అంతకన్నా ఎక్కువ పెర్ఫామెన్స్ ఇస్తుందని అంచనా. ఇక ప్రపంచంలోనే సన్నని 5జీ స్మార్ట్‌ఫోన్‌గా మోటోరోలా ఇండియా చెబుతోంది. (image: Motorola India)
3. మోటోరోలా ఎడ్జ్ 30 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 6జీబీ ర్యామ్ +128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.27,999 కాగా, 8జీబీ ర్యామ్ +128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999. మే 19 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్ స్టోర్లతో పాటు రీటైల్ స్టోర్లలో కొనొచ్చు. (image: Motorola India)
4. మోటోరోలా ఎడ్జ్ 30 స్మార్ట్‌ఫోన్‌ను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.2,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్‌తో 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.25,999 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.27,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్స్ కూడా ఉన్నాయి. (image: Motorola India)
5. మోటోరోలా ఎడ్జ్ 30 స్మార్ట్‌ఫోన్‌ను అరోరా గ్రీన్, మెటియార్ గ్రే కలర్స్‌లో కొనొచ్చు. ఈ మొబైల్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఓలెడ్ డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ+ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌తో రిలీజైన మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. (image: Motorola India)
6. మోటోరోలా ఎడ్జ్ 30 స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా ఫీచర్స్ చూస్తే క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 50మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ మ్యాక్రో విజన్ సెన్సార్ + 16మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో వెనుకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. (image: Motorola India)
7. రియర్ కెమెరాలో డ్యూయెల్ క్యాప్చర్, స్పాట్ కలర్, నైట్ విజన్, ఆటో నైట్ విజన్, పోర్ట్రైట్, పనోరమా లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సెల్ఫీ కెమెరాలో డ్యూయెల్ క్యాప్చర్, స్పాట్ కలర్, ఆటో నైట్ విజన్, సినిమాగ్రాఫ్, పోర్ట్రైట్, గ్రూప్ సెల్ఫీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Motorola India)
8. మోటోరోలా ఎడ్జ్ 30 స్మార్ట్‌ఫోన్‌లో 4,020ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఫుల్ ఛార్జ్ చేస్తే ఒకటిన్నర రోజు బ్యాటరీ వస్తుందని కంపెనీ చెబుతోంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇది స్టాక్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్. ఇందులో గూగుల్ యాప్స్, మోటో యాప్స్ తప్ప ఇతర బ్లోట్‌వేర్ ఉండదు. (image: Motorola India)