1. ఆన్లైన్ క్లాసుల కోసం మంచి ట్యాబ్లెట్ కొనాలనుకుంటున్నారా? వీకెండ్లో సినిమాలు చూసేందుకు ఓ ట్యాబ్ తీసుకోవాలా? భారతదేశంలో మోటో ట్యాబ్ జీ70 (Moto Tab G70) రిలీజ్ అయింది. గతేడాది రిలీజ్ అయిన రియల్మీ ప్యాడ్, నోకియా టీ20 ట్యాబ్ ట్యాబ్లెట్లకు మోటో ట్యాబ్ జీ70 గట్టి పోటీ ఇవ్వనుంది. (image: Motorola India)
2. మోటో ట్యాబ్ జీ70 కేవలం 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో మాత్రమే రిలీజ్ అయింది. ధర రూ.21,990. సేల్ ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో కొనొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కొంటే 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం అన్లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. (image: Motorola India)
3. మోటో ట్యాబ్ జీ70 స్పెసిఫికేషన్స్ చూస్తే ఇది ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్. మోటోరోలా స్మార్ట్ఫోన్లలో ఆండ్రాయిడ్ యాప్స్, మోటోరోలా యాప్స్ తప్ప ఇతర బ్లోట్‌వేర్ ఉండదు. ఈ ట్యాబ్లెట్ కూడా అలాగే ఉంటుంది. 4జీబీ+64జీబీ వేరియంట్లో లభిస్తుంది. మైక్రో ఎస్డీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. (image: Motorola India)
4. మోటో ట్యాబ్ జీ70 ట్యాబ్లెట్ మీడియాటెక్ హీలియో జీ90టీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో 7,700 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉండటం విశేషం. 20వాట్ ర్యాపిడ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 12 గంటల పాటు వీడియో ప్లేబ్యాక్, 12 గంటల వెబ్ బ్రౌజింగ్ చేయొచ్చు. ఇందులో గూగుల్ ఎంటర్టైన్మెంట్ స్పేస్ ప్రత్యేకంగా ఉండటం విశేషం. (image: Motorola India)
5. మోటో ట్యాబ్ జీ70 ట్యాబ్లెట్లో 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉండగా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. మోటో ట్యాబ్ జీ70 ట్యాబ్లెట్లో క్వాడ్ స్పీకర్స్, డ్యూయెల్ మైక్ సెటప్, డ్యూయెల్ బ్యాండ్ వైఫై లాంటి ఫీచర్స్ ఉంటాయి. పిల్లల కోసం ప్రత్యేకంగా గూగుల్ కిడ్స్ స్పేస్ ఉంటుంది. ఇందులో 10,000 పైగా టీచర్ అప్రూవ్డ్ యాప్స్ పిల్లల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయి. (image: Motorola India)
6. ఇటీవల స్మార్ట్‌ఫోన్ కంపెనీలు పోటాపోటీగా ట్యాబ్లెట్స్ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో వర్క్ ఫ్రమ్ హోమ్ పెరిగిపోవడం, ఆన్లైన్ క్లాసులు, ఆన్లైన్ కోర్సులకు అలవాటు పడటంతో ట్యాబ్లెట్స్ కొంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగా కంపెనీలు కొత్త ట్యాబ్లెట్లను పరిచయం చేస్తున్నాయి. (image: Motorola India)
7. రియల్మీ ప్యాడ్, నోకియా టీ20 ట్యాబ్లెట్స్ కన్నా మోటో ట్యాబ్ జీ70 ధర కాస్త ఎక్కువగా ఉంది. రియల్మీ ప్యాడ్ 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.15,999 కాగా, నోకియా టీ20 ట్యాబ్లెట్ 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.18,499. ఇక కొద్ది రోజుల క్రితం మోటో ట్యాబ్ జీ20 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.10,999. (image: Motorola India)