మోటొరోలా కంపెనీ ఇండియాలో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో లాంచ్ చేయనుంది. జూన్ 9న ఈ సంస్థ నుంచి మోటో జీ82 5జీ (Moto G82 5G) ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉందని టిప్‌స్టర్స్ పేర్కొన్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్, స్నాప్‌డ్రాగన్ 695 5G SoC చిప్సెట్తో వస్తుంది. ఈ డివైజ్ ఇప్పటికే యూరప్‌లో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో వస్తుంది. దీని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వచ్చిన ఈ డివైజ్.. 30W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీతో వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇండియాలో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌పై టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ ఒక ట్వీట్ చేశారు. Moto G82 5G ఫోన్ జూన్ 9న మన దేశంలో లాంచ్ అవుతుందని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. మార్చిలో రిలీజ్ అయిన పోకో ఎక్స్4 ప్రో (Poco X4 Pro) తో ఈ మోడల్ పోటీపడుతుంది. ఈ రెండు స్మార్ట్ఫోన్లు డిస్ప్లే, SoC, బ్యాటరీ పరంగా ఒకే విధమైన స్పెసిఫికేషన్లతో వస్తున్నాయి. మోటొరోలా ఫోన్ యూరోపియన్ మార్కెట్లో అందుబాటులో ఉంది. స్పెసిఫికేషన్ల విషయానికొస్తే, ఇండియన్ వేరియంట్ యూరోపియన్ వేరియంట్‌తో సమానమైన ఇంటర్నల్స్‌తో రావచ్చు.