1. మోటోరోలా ఇండియా నుంచి మరో స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. మోటో జీ73 5జీ (Moto G73 5G) స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది కంపెనీ. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.20,000 లోపు బడ్జెట్లో రిలీజైంది. ఆఫర్లో రూ.16,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ ధరకు 8జీబీ ర్యామ్‌తో మోటో జీ73 5జీ మొబైల్‌ను అందిస్తోంది మోటోరోలా ఇండియా. (image: Motorola India)
3. మోటో జీ73 5జీ స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే వేరియంట్లో రిలీజైంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ప్రకటించింది మోటోరోలా. రూ.2,000 తగ్గింపు పొందొచ్చు. ఆఫర్‌తో రూ.16,999 ధరకే మోటో జీ73 5జీ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. మార్చి 16న మధ్యాహ్నం 12 గంటలకు రిలయన్స్ డిజిటల్, జియోమార్ట్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో మోటో జీ73 5జీ సేల్ ప్రారంభం అవుతుంది. మిడ్నైట్ బ్లూ, ల్యూసెంట్ వైట్ కలర్స్‌లో కొనొచ్చు. (image: Motorola India)
4. మోటో జీ73 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 930 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియెన్స్ లభిస్తుంది. ఇందులో గూగుల్ యాప్స్, మోటోరోలా యాప్స్ తప్ప బ్లోట్‌వేర్, జంక్‌వేర్ ఉండదు. 8జీబీ ర్యామ్ సపోర్ట్ ఉండగా, 128జీబీ స్టోరేజ్ లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. (image: Motorola India)
5. మోటో జీ73 5జీ స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ చూస్తే ఇందులో అల్ట్రా పిక్సెల్ టెక్నాలజీతో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 8మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్‌తో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. 8మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ మ్యాక్రో కెమెరాలా కూడా పనిచేస్తుంది. ఇందులో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. (image: Motorola India)