1. మోటోరోలా ఇండియా ఈ ఏడాది జనవరిలో మోటో జీ71 5జీ (Moto G71 5G) స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. రిలీజైన మొదట్లో ఈ స్మార్ట్‌ఫోన్ పాపులర్‌గా నిలిచింది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉండటంతో పాటు 50 మెగాపిక్సెల్ కెమెరా, అమొలెడ్ డిస్ప్లే లాంటి ఫీచర్స్ ఉన్నాయి. రూ.20,000 లోపు సెగ్మెంట్లో ఈ స్మార్ట్‌ఫోన్ గట్టి పోటీ ఇచ్చింది. (image: Motorola India)
2. మోటో జీ71 5జీ స్మార్ట్‌ఫోన్ కేవలం 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే రిలీజ్ అయింది. జనవరిలో రిలీజ్ అయినప్పుడు ధర రూ.18,999. ఇటీవల మోటో డేస్ సేల్‌లో (Moto Days Sale) రూ.16,999 ధరకే లభించింది. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింది. ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.15,999 ధరకే లిస్ట్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ నెప్ట్యూన్ గ్రీన్, ఆర్క్టిక్ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. (image: Motorola India)
3. ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంక్ ఆఫర్‌తో ఇంకా తక్కువ ధరకే ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొంటే 10 శాతం తగ్గింపు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈఎంఐ ద్వారా కొనాలనుకునేవారికి రూ.555 నుంచే ఈఎంఐ ఆప్షన్స్ మొదలవుతాయి. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. పాత మొబైల్ ఎక్స్ఛేంజ్ చేసేవారికి రూ.12,500 డిస్కౌంట్ లభిస్తుంది. (image: Motorola India)
4. మోటో జీ71 5జీ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.4 అంగుళాల ఫుల్ హెచ్డీ+ మ్యాక్స్ విజన్ అమొలెడ్ డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇటీవల బాగా పాపులర్ అయిన ప్రాసెసర్ ఇది. ఇదే ప్రాసెసర్ వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ, పోకో ఎక్స్4 ప్రో, ఐకూ జెడ్6, రెడ్మీ నోట్ 11 ప్రో+ లాంటి మొబైల్స్‌లో కూడా ఉంది. (image: Motorola India)
5. మోటో జీ71 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కెమెరాలో డ్యూయెల్ క్యాప్చర్, స్పాట్ కలర్, నైట్ విజన్, మ్యాక్రో విజన్, సినిమాగ్రాఫ్, పోర్ట్రైట్, కటౌట్, లైవ్ ఫిల్టర్, పనోరమా, ఏఆర్ స్టిక్కర్స్, ప్రో మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Motorola India)
6. మోటో జీ71 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ టర్బోపవర్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఛార్జర్ బాక్సులోనే ఇస్తోంది మోటోరోలా. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 + మై యూఎక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 13 5జీ బ్యాండ్స్ సపోర్ట్ ఉండటం విశేషం. 4జీ, ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. (image: Motorola India)