1. మోటోరోలా ఇండియా కొద్ది రోజుల క్రితం మోటో జీ71 5జీ (Moto G71 5G) స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో రిలీజ్ చేసింది. యూరప్‌లో గతేడాది నవంబర్‌లో మోటో జీ200, మోటో జీ51, మోటో జీ41, మోటో జీ31 మోడల్స్‌తో పాటు మోటో జీ71 5జీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్ ఇటీవల ఇండియాకు వచ్చింది. ఈ రోజు నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. (image: Motorola India)
2. మోటో జీ71 5జీ స్మార్ట్‌ఫోన్ కేవలం 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే రిలీజ్ అయింది. ధర రూ.18,999. మోటో జీ71 5జీ స్మార్ట్‌ఫోన్ రూ.20,000 లోపు బడ్జెట్లో లభిస్తోంది. ఇప్పటికే ఈ బడ్జెట్లో రియల్మీ నార్జో 30 5జీ, రెడ్మీ నోట్ 11టీ 5జీ, రియల్మీ 8ఎస్ 5జీ, ఐకూ జెడ్3 లాంటి మోడల్స్ ఉన్నాయి. వీటికి మోటో జీ71 5జీ గట్టి పోటీ ఇవ్వనుంది. (image: Motorola India)
3. మోటో జీ71 5జీ సేల్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో కొనొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ జనవరి 22న ముగుస్తుంది. అప్పటివరకు ఈ డిస్కౌంట్ ఆఫర్ పొందొచ్చు. ఇక ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం అన్లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. (image: Motorola India)
4. ఇప్పటికే ఇండియాలో మోటో జీ51, మోటో జీ31 మోడల్స్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. వీటికన్నా ఎక్కువ స్పెసిఫికేషన్స్‌తో మోటో జీ71 5జీ స్మార్ట్‌ఫోన్ లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో లేటెస్ట్ ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ఉండటం విశేషం. ఈ ప్రాసెసర్‌తో ఇండియాలో రిలీజ్ అయిన మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే. (image: Motorola India)
5. మోటో జీ71 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.4 అంగుళాల ఫుల్ హెచ్డీ+ మ్యాక్స్ విజన్ అమొలెడ్ డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 + మై యూఎక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 13 5జీ బ్యాండ్స్ సపోర్ట్ ఉండటం విశేషం. (image: Motorola India)
6. రూ.20,000 లోపు బడ్జెట్లో 13 బ్యాండ్స్ 5జీ సపోర్ట్ ఇస్తున్న స్మార్ట్‌ఫోన్ మోటో జీ71 5జీ కావడం విశేషం. 4జీ, ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. మోటో జీ71 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ టర్బోపవర్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఛార్జర్ బాక్సులోనే ఇస్తోంది మోటోరోలా. ఈ స్మార్ట్‌ఫోన్ నెప్ట్యూన్ గ్రీన్, ఆర్క్టిక్ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. (image: Motorola India)
7. మోటో జీ71 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కెమెరాలో డ్యూయెల్ క్యాప్చర్, స్పాట్ కలర్, నైట్ విజన్, మ్యాక్రో విజన్, సినిమాగ్రాఫ్, పోర్ట్రైట్, కటౌట్, లైవ్ ఫిల్టర్, పనోరమా, ఏఆర్ స్టిక్కర్స్, ప్రో మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Motorola India)