1. మోటోరోలా ఇండియా ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రూ.15,000 లోపు బడ్జెట్లో మరో స్మార్ట్‌ఫోన్ పరిచయం చేసిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఇంటర్నేషనల్ మార్కెట్లో రిలీజ్ అయిన మోటో జీ51 (Moto G51) స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రిలీజ్ అయింది. కొద్ది రోజుల క్రితమే మోటో జీ31 (Moto G31) మోడల్ ఇండియాలో రిలీజ్ అయింది. ఆ తర్వాత మోటో జీ51 స్మార్ట్‌ఫోన్ వచ్చింది. (image: Motorola India)
2. మోటో జీ51 స్మార్ట్‌ఫోన్ ధర రూ.14,999. ఇప్పటికే ఈ బడ్జెట్లో రెడ్మీ నోట్ 11టీ 5జీ (Redmi Note 11T 5G), రెడ్మీ నోట్ 10టీ 5జీ (Redmi Note 10T 5G), రియల్మీ 8 5జీ (Realme 8 5G), పోకో ఎం3 ప్రో 5జీ (Poco M3 Pro 5G), రియల్మీ నార్జో 30 5జీ (Realme Narzo 30 5G) స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. (image: Motorola India)
4. ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సేల్‌లో మోటో జీ51 స్మార్ట్‌ఫోన్‌ను ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొంటే 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. గరిష్టంగా రూ.1,000 తగ్గింపు పొందొచ్చు. అంటే మోటో జీ51 స్మార్ట్‌ఫోన్‌ను రూ.13,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ డిసెంబర్ 21 వరకే లభిస్తుంది. (image: Motorola India)
5. మోటో జీ51 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్. ఈ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ యాప్స్‌తో పాటు మోటోరోలాకు చెందిన ఒకట్రెండు యాప్స్ మాత్రమే ఉంటాయి. ఇతర బ్లోట్‌వేర్ ఉండదు. (image: Motorola India)
6. మోటో జీ51 స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 20వాట్ ర్యాపిడ్ ఛార్జింగ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ లైఫ్ 30 గంటలు వస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను బ్లూ, గ్రేడ్ కలర్స్‌లో కొనొచ్చు. (image: Motorola India)
7. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480+ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 5జీ స్మార్ట్‌ఫోన్. మొత్తం 12 5జీ బ్యాండ్స్ సపోర్ట్ లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డాల్బీ అట్మాస్ సపోర్ట్, వైఫై 5, బ్లూటూస్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. (image: Motorola India)
8. మోటో జీ51 స్మార్ట్‌ఫోన్‌లో 50మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. డ్యూయెల్ క్యాప్చర్, స్పాట్ కలర్, లో లైట్ ఏఐ సెల్ఫీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Motorola India)