1. మోటోరోలా ఇండియా భారతదేశంలో పోటాపోటీగా స్మార్ట్ఫోన్లను లాంఛ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల జీ సిరీస్‌లో మోటో జీ32 (Moto G32) మోడల్ని పరిచయం చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ యూరప్‌లో జూలైలో లాంఛైన సంగతి తెలిసిందే. ఇందులో 90Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ (Snapdragon 680 Processor), 50MP కెమెరా లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Motorola India)
2. మోటో జీ32 సేల్ ఆగస్ట్ 16 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు. మోటో జీ32 కేవలం 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే రిలీజైంది. ధర రూ.12,999. హెచ్డీఎఫ్సీ కార్డుతో కొంటే రూ.1,250 ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్‌తో మోటో జీ32 స్మార్ట్‌ఫోన్‌ను రూ.11,749 ధరకే కొనొచ్చు. (image: Motorola India)
3. మోటో జీ32 డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల డిస్ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ లేటెస్ట్గా రిలీజైన వివో టీ1ఎక్స్‌తో పాటు మోటో జీ52, రెడ్మీ 10 పవర్, రియల్మీ 9 4జీ, ఒప్పో కే10, రెడ్మీ 10, రెడ్మీ నోట్ 11, వివో వై33టీ, రియల్మీ 9ఐ స్మార్ట్ఫోన్లలో ఉంది. (image: Motorola India)
4. మోటో జీ32 కెమెరా ఫీచర్స్ చూస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. రియర్ కెమెరాలో అల్ట్రా రెజల్యూషన్, డ్యూయెల్ క్యాప్చర్, స్పాట్ కలర్, నైట్ విజన్, మ్యాక్రో విజన్, పోర్ట్రైట్, లైవ్ ఫిల్టర్, పనోరమా, ఏఆర్ స్టిక్కర్స్, స్మార్ట్ కంపోజిషన్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Motorola India)
5. మోటో జీ32 కెమెరాలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరాలో డ్యూయెల్ క్యాప్చర్, స్పాట్ కలర్, పోర్ట్రైట్, లైవ్ ఫిల్టర్, గ్రూప్ సెల్ఫీ, షాట్ ఆప్టిమైజేషన్, జెస్చర్ సెల్ఫీ, ఫేస్ బ్యూటీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. మోటో జీ32 మొబైల్లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. (image: Motorola India)
6. మోటో జీ32 ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 అప్డేట్తో పాటు మూడేళ్లు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని కంపెనీ చెబుతోంది. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే డ్యూయెల్ సిమ్, 4జీ, డ్యూయెల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్ సీ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. డాల్బీ అట్మాస్ డ్యూయెల్ స్టీరియో స్పీకర్స్ సపోర్ట్ కూడా ఉంది. మినరల్ గ్రే, సాటిన్ సిల్వర్ కలర్స్‌లో కొనొచ్చు. (image: Motorola India)