1. మోటోరోలా ఇండియా ఇటీవల మరో స్మార్ట్‌ఫోన్‌ను భారతీయ మార్కెట్లో రిలీజ్ చేసింది. మోటో జీ31 (Moto G31) స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ కొద్ది రోజుల క్రితం యూరప్ మార్కెట్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే మొబైల్‌ను ఇండియాకు తీసుకొచ్చింది. మోటో జీ31 స్మార్ట్‌ఫోన్ సేల్ డిసెంబర్ 6 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ మొదలవుతుంది. (image: Motorola India)
2. మోటో జీ31 (Moto G31) స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఇది స్టాక్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్. ఇందులో గూగుల్ యాప్స్ (Google apps) తప్ప ఇతర బ్లోట్‌వేర్, ఇన్‌బిల్ట్ యాప్స్ ఉండవు. మోటో జీ31 స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999. (image: Motorola India)
3. మోటో జీ31 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 4జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజ్ అయింది. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్‌తో 1టీబీ వరకు మెమొరీ పెంచుకోవచ్చు. ఇందులో 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4 అంగుళాల హెచ్డీ+ ఓలెడ్ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. (image: Motorola India)
4. మోటో జీ31 స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ వైడ్ యంగిల్ కెమెరా + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. కెమెరాలో డ్యూయెల్ క్యాప్చర్, స్పాట్ కలర్, నైట్ విజన్, పోర్ట్రైట్, లైవ్ ఫిల్టర్, ఏఆర్ స్టిక్కర్స్, ప్రో మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. (image: Motorola India)
5. మోటో జీ31 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 స్టాక్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 20వాట్ టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ 36 గంటల పాటు పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను బేబీ బ్లూ, మెటియోరైట్ గ్రే కలర్స్‌లో కొనొచ్చు. (image: Motorola India)
6. మోటో జీ31 స్మార్ట్‌ఫోన్‌లో 4జీ ఎల్టీఈ, ఎఫ్ఎం రేడియో, 3.5ఎంఎం ఆడియో జాక్, బ్లూటూత్ వర్షన్ 5, డ్యూయెల్ బ్యాండ్ వైఫై, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఫింగర్‌ప్రింట్ రీడర్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Motorola India)