1. మోటోరోలా ఇండియా గతేడాది రిలీజ్ చేసిన మోటో జీ31 (Moto G31) స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ లభిస్తోంది. రిలీజ్ ధరలతో పోలిస్తే ఈ మొబైల్ ధర రూ.1,000 తగ్గింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా లభిస్తోంది. ఈ ఆఫర్‌తో మోటో జీ31 స్మార్ట్‌ఫోన్‌ను రూ.10,700 ధరతో కొనొచ్చు. (image: Motorola India)
2. మోటో జీ31 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. రిలీజ్ అయినప్పుడు 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999. ప్రస్తుతం 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.11,999 కాగా, 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.13,999. (image: Motorola India)
3. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్‌తో 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.10,700 ధరకు కొనొచ్చు. సిటీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కొంటే 10 శాతం తగ్గింపు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈఎంఐ ద్వారా ఈ మొబైల్ కొనాలంటే ఈఎంఐ ఆఫర్స్ ఉన్నాయి. రూ.416 నుంచి ఈఎంఐ ప్రారంభం అవుతుంది. (image: Motorola India)
4. మోటో జీ31 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4 అంగుళాల హెచ్డీ+ ఓలెడ్ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ ఇన్ఫీనిక్స్ హాట్ 12, టెక్నో స్పార్క్ 8 ప్రో, రియల్మీ నార్జో 50ఏ, రియల్మీ నార్జో 30ఏ లాంటి మొబైల్స్‌లో ఉంది. (image: Motorola India)
5. మోటో జీ31 స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ వైడ్ యంగిల్ కెమెరా + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. కెమెరాలో డ్యూయెల్ క్యాప్చర్, స్పాట్ కలర్, నైట్ విజన్, పోర్ట్రైట్, లైవ్ ఫిల్టర్, ఏఆర్ స్టిక్కర్స్, ప్రో మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. (image: Motorola India)
6. మోటో జీ31 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 స్టాక్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో గూగుల్ యాప్స్ తప్ప ఇతర బ్లోట్‌వేర్, ఇన్‌బిల్ట్ యాప్స్ ఉండవు. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్‌తో 1టీబీ వరకు మెమొరీ పెంచుకోవచ్చు. 4జీ ఎల్టీఈ, ఎఫ్ఎం రేడియో, 3.5ఎంఎం ఆడియో జాక్, బ్లూటూత్ వర్షన్ 5, డ్యూయెల్ బ్యాండ్ వైఫై, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Motorola India)