1. ఫ్లిప్‌కార్ట్ మంత్ ఎండ్ మొబైల్స్ ఫెస్ట్ (Flipkart Month End Mobile Fest) సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. గతంలో రూ.15,000 లోపు లభించిన మోటో జీ31 ఆఫర్లో రూ.10,000 లోపే లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో అమొలెడ్ డిస్ప్లే, 6GB వరకు ర్యామ్, 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Motorola India)
2. మోటో జీ31 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయినప్పుడు ధరలు చూస్తే 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999. ప్రస్తుతం 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.10,499 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.12,499 ధరకు ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో లిస్ట్ అయ్యాయి. (image: Motorola India)
3. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొంటే డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్‌తో మోటో జీ31 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.9,749 ధరకే కొనొచ్చు. తొలిసారి మోటో జీ31 రూ.10,000 లోపు లభిస్తుండటం విశేషం. నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా ఉంది. నోకాస్ట్ ఈఎంఐ రూ.1,750 నుంచి ప్రారంభం అవుతుంది. (image: Motorola India)
4. ఎక్స్ఛేంజ్ ద్వారా కొనాలనుకునేవారికీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. రూ.9,750 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. బేబీ బ్లూ, మెటియోరైట్ గ్రే కలర్స్‌లో కొనొచ్చు. మోటో జీ31 డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4 అంగుళాల హెచ్డీ+ ఓలెడ్ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. (image: Motorola India)
5. మోటో జీ31 స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ వైడ్ యంగిల్ కెమెరా + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. మోటో జీ31 స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 20వాట్ టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. (image: Motorola India)
6. మోటో జీ31 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 స్టాక్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో గూగుల్ యాప్స్ తప్ప ఇతర బ్లోట్‌వేర్, ఇన్‌బిల్ట్ యాప్స్ ఉండవు. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్‌తో 1టీబీ వరకు మెమొరీ పెంచుకోవచ్చు. 4జీ ఎల్టీఈ, ఎఫ్ఎం రేడియో, 3.5ఎంఎం ఆడియో జాక్, బ్లూటూత్ వర్షన్ 5, డ్యూయెల్ బ్యాండ్ వైఫై, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Motorola India)