1. ఫ్లాగ్షిప్ ఫీచర్స్‌తో ఇటీవల మోటో ఎడ్జ్ 30 ప్రో (Moto Edge 30 Pro) స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మోటోరోలా నుంచి ప్రీమియం ఎడ్జ్ సిరీస్‌లో వచ్చిన మరో స్మార్ట్‌ఫోన్ ఇది. 50మెగాపిక్సెల్ కెమెరాలు, 60మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 68వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, Wi-Fi 6e కనెక్టివిటీ లాంటి అదిరిపోయే ఫీచర్స్ ఉన్నాయి. (image: Motorola India)
2. మోటో ఎడ్జ్ 30 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్కు చెందిన పవర్ఫుల్ చిప్సెట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ఉంది. ఇదే ప్రాసెసర్ రెండు రోజుల క్రితం ఐకూ 9 ప్రో (iQoo 9 ప్రో) స్మార్ట్‌ఫోన్‌తో పాటు సాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ స్మార్ట్ఫోన్లలో కూడా ఉంది. ఈ స్మార్ట్ఫోన్లకు మోటో ఎడ్జ్ 30 ప్రో గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే రిలీజ్ అయింది. ధర రూ.49,999. (image: Motorola India)
3. సాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్, ఐకూ 9 ప్రో స్మార్ట్ఫోన్లతో పోలిస్తే మోటో ఎడ్జ్ 30 ప్రో తక్కువ ధరకే లభిస్తోంది. మోటో ఎడ్జ్ 30 ప్రో సేల్ మార్చి 4 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కానుంది. మోటో స్టోర్స్‌లో, రీటైల్ స్టోర్లలో కూడా కొనొచ్చు. కాస్మో బ్లూ, స్టార్‌డస్ట్ వైట్ కలర్స్‌లో కొనొచ్చు. (image: Motorola India)
4. ఫ్లిప్‌కార్ట్‌లో మోటో ఎడ్జ్ 30 ప్రో స్మార్ట్‌ఫోన్ ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.5,000 డిస్కౌంట్ ఇన్స్టంట్ లభిస్తుంది. అంటే ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.44,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈఎంఐ ద్వారా కొనాలనుకునేవారికి రూ.5,556 నుంచి ఈఎంఐ ప్రారంభం అవుతుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొంటే 5 శాతం అన్లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. (image: Motorola India)
5. మోటో ఎడ్జ్ 30 ప్రో స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఓలెడ్ డిస్ప్లే ఉంది. ముందువైపు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, వెనుకవైపు త్రీడీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్టాక్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. (image: Motorola India)
6. మోటో ఎడ్జ్ 30 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో ఇందులో గూగుల్ యాప్స్, మోటోరోలా యాప్స్ తప్ప ఇతర బ్లోట్‌వేర్ ఉండదు. ఆండ్రాయిడ్ 13, ఆండ్రాయిడ్ 14 అప్డేట్స్తో పాటు మూడేళ్లు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని కంపెనీ చెబుతోంది. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే 13 5జీ బ్యాండ్స్ సపోర్ట్, Wi-Fi 6e, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, డ్యూయెల్ సిమ్, బ్లూటూత్ 5.2 లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. (image: Motorola India)
7. మోటో ఎడ్జ్ 30 ప్రో స్మార్ట్‌ఫోన్ కెమెరా విశేషాలు చూస్తే ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా + 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాలతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ప్రైమరీ రియర్ కెమెరాతో 8కే, 4కే వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. రియర్ కెమెరాలో మ్యాక్రో, స్లో మోషన్, ఏఆర్ స్టిక్కర్, డ్యూయెల్ క్యాప్చర్, స్పాట్ కలర్, సూపర్ స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, పోర్ట్రైట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Motorola India)
8. మోటో ఎడ్జ్ 30 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 60మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండటం విశేషం. ఫ్రంట్ కెమెరాలో అల్ట్రా రెజల్యూషన్, ప్రో, పనోరమా, ఏఆర్ స్టిక్కర్స్, లైవ్ ఫిల్టర్, డ్యూయెల్ క్యాప్చర్, స్పాట్ కలర్, నైట్ విజన్, సినిమాటోగ్రాఫ్, పోర్ట్రైట్, కటౌట్, స్కాన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Motorola India)
9. మోటో ఎడ్జ్ 30 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 4,800ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 68వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కేవలం 15 నిమిషాల్లో 50శాతం ఛార్జింగ్ చేయొచ్చు. 15వాట్ వైర్లెస్ ఛార్జింగ్, 5వాట్ వైర్లెస్ పవర్ షేరింగ్ సపోర్ట్ కూడా ఉంది. డాల్బీ ఆట్మాస్ సపోర్ట్‌తో డ్యూయెల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. థింక్‌షీల్డ్ మొబైల్ సెక్యూరిటీ కూడా ఉంది. (image: Motorola India)