1. మోటోరోలా ఇండియా ఇటీవల మోటో ఇ32 (Moto E32) బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ (Budget Smartphone) రిలీజ్ చేసింది. రూ.10,000 పైన బడ్జెట్లో ఈ మొబైల్ రిలీజైంది. ఇప్పుడు ధర తగ్గింది. రూ.10,000 లోపే ఈ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్స్‌తో రూ.9,500 లోపే ఈ మొబైల్ కొనొచ్చు. (image: Motorola India)
2. మోటో ఇ32 స్మార్ట్‌ఫోన్ ఒకే వేరియంట్లో రిలీజైంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,499. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.9,999 ధరకే లిస్ట్ అయింది. ఈఎంఐ ఆఫర్ రూ.347 నుంచి ప్రారంభం అవుతుంది. మోటో ఇ32 స్మార్ట్‌ఫోన్‌లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్ప్లే, మీడియాటెక్ ప్రాసెసర్, ఐపీ రేటెడ్ వాటర్ రెసిస్టెన్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Motorola India)
4. మోటో ఇ32 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇది స్టాక్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఇందులో గూగుల్ యాప్స్, మోటోరోలా యాప్స్ మాత్రమే ఉంటాయి. జంక్‌వేర్, బ్లోట్ వేర్ ఉండదు. ఇది 4జీ స్మార్ట్‌ఫోన్. 4జీ ఎల్టీఈ, డ్యూయెల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 3.5ఎంఎం జాక్ లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. (image: Motorola India)