3. మోటో ఇ13 రెండు వేరియంట్లలో రిలీజైంది. 2జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.6,999 కాగా, 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,999. ఫిబ్రవరి 15 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం అవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు. రీటైల్ స్టోర్లలో కూడా లభిస్తుంది. కాస్మిక్ బ్లాక్, అరోరా గ్రీన్, క్రీమీ వైట్ కలర్స్‌లో లభిస్తుంది. (image: Motorola India)
4. ఫ్లిప్‌కార్ట్‌లో మోటో ఇ13 మొబైల్ కొనేవారికి పలు ఆఫర్స్ ఉన్నాయి. హెచ్ఎస్బీసీ, ఇండస్ఇండ్, వన్‌కార్డ్ క్రెడిట్ కార్డులతో కొంటే 10 శాతం తగ్గింపు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈఎంఐ ఆఫర్ కూడా ఉంది. రూ.247 ఈఎంఐతో మోటో ఇ13 సొంతం చేసుకోవచ్చు. జియో నుంచి రూ.2,500 విలువైన బెనిఫిట్స్, రూ.700 ఫ్లాట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. (image: Motorola India)
5. మోటో ఇ13 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.5 అంగుళాల హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 4జీబీ వరకు ర్యామ్, 64జీబీ స్టోరేజ్ లభిస్తుంది. మెమొరీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. (image: Motorola India)
6. మోటో ఇ13 స్మార్ట్‌ఫోన్‌లో 13మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉండగా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కెమెరాలో పోర్ట్రైట్, ఫోటో, పనోరమా, ప్రో మోడ్, ఆటో స్మైల్ క్యాప్చర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, 10వాట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. డ్యూయెల్ సిమ్, వైఫై, బ్లూటూత్, టైప్ సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Motorola India)
7. మోటోరోలా నుంచి ఇప్పటికే రూ.10,000 లోపు బడ్జెట్లో మోటో ఇ32 స్మార్ట్‌ఫోన్ ఉంది. ధర రూ.8,999. ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Motorola India)