ఏటా మే నెలలో వచ్చే రెండో ఆదివారాన్ని మనం మదర్స్ డే గా జరుపుకుంటాం. అనేక మంది ఈ రోజు తమ తల్లికి మంచి గిఫ్ట్ ఇచ్చి తమ ప్రేమను చాటాలనుకుంటారు. ఆ గిఫ్ట్ దాచుకునేది కాకుండా ఎల్లప్పుడు ఉపయోగం కలిగించేది అయితే బాగుంటుంది. ఈ రోజుల్లో ఆ కేటగిరీల్లోకి వచ్చే ముఖ్యమైన వస్తువు స్మార్ట్ ఫోన్. నిత్యం లేచిన దగ్గర నుంచి పడుకునే వారకు అందరి వెంట ఉండే వస్తువుగా స్మార్ట్ ఫోన్ మారింది. ఈ నేపథ్యంలో మంచి స్మార్ట్ ఫోన్ ను మీ మదర్ కు ఇచ్చి వారిని సంతోషంలో నింపొచ్చు. ఈ నేపథ్యంలో రూ. 20 వేల లోపు ధర కలిగి, మంచి ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్ల వివరాలను మీకు అందిస్తున్నాం.(ప్రతీకాత్మక చిత్రం)
భారీ బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఫోన్ మీకు కావాలంటే మీకు బెస్ట్ ఛాయిస్ Samsung Galaxy F41. గతేడాది సంస్థ లాంఛ్ చేసిన ఎఫ్ సీరీస్ లో ఈ ఫోన్ ఒకటి. 6,000mAh భారీ బ్యాటరీ సామర్థ్యం ఈ ఫోన్ సొంతం. ఈ ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది, ఈ ఫోన్ వాస్తవ ధర రూ. 14,999, కానీ ఈ ఫోన్ ను వివిధ ఈ కామర్స్ సైట్లలో ఆఫర్ల ద్వారా రూ. 12,999 కే సొంతం చేసుకోవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
రూ. 10 వేల రేంజ్ లో స్మార్ట్ ఫోన్ కావాలనుకునే వారికి Poco M3 మంచి ఆప్షన్ గా చెప్పవచ్చు. ఈ ఫోన్ 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 48-మెగా పిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా ఉంటుంది. 6,000mAh భారీ బ్యాటరీతో పాటు ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)
రూ. 20 వేల లోపు ధర కలిగిన బెస్ట్ స్మార్ట్ ఫోన్లలో Nokia 5.4 కూడా ముందు వరుసలో ఉంటుంది. ఈ ఫోన్ బేస్ వేరియంట్ (4GB ర్యామ్ + 64GB స్టోరేజ్) ధర రూ. 13,999. 6GB RAM + 64GB వేరియంట్ ధర రూ. 15,499. ఈ ఫోన్ 6.4-అంగుళాల HD+ డిస్ప్లేను కలిగి ఉంటుంది. 48-మెగా పిక్సెల్ వైడ్ కెమెరా ఉంటుంది. 4,000mAh బ్యాటరీ ఈ ఫోన్లో ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
Redmi Note 10 Pro: ఈ ఫోన్ 6GB + 64GB వేరియంట్ ధర రూ. 15,999. 6GB + 128GB వేరియంట్ ను రూ. 16,999, 8GB + 128GB వేరియంట్ స్మార్ట్ ఫోన్ ను Rs. 18,999కు సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ 64-మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5,020mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 16-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)