Flipkart Sale | దిగ్గజ ఈకామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. భారీ తగ్గింపు లభిస్తోంది. వివిధ రకాల ప్రొడక్టులపై ఆకర్షణీయ డీల్స్ సొంతం చేసుకోవచ్చు. వీటిల్లో స్మార్ట్ టీవీలు కూడా ఉన్నాయి. టీవీలపై కళ్లుచెదిరే డిస్కౌంట్ లభిస్తోంది. అందుబాటు ధరకే లభిస్తున్న 55 అంగుళాల టాప్ 10 స్మార్ట్‌టీవీలు ఏంటివో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫాక్స్‌స్కై 55 అంగుళాల 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ 55ఎఫ్ఎస్ వీఎస్ టీవీ ఎంఆర్పీ రూ. 98 వేలుగా ఉంది. అయితే దీన్ని సేల్‌లో రూ. 24,999కే పొందొచ్చు. అంటే 74 శాతం తగ్గింపు లభిస్తోంది. అమెజాన్‌లో ఈ ఆఫర్ పొందొచ్చు. ఇంకా బ్యాంక్ ఆఫర్లు కూడా పొందొచ్చు. ఈఎంఐలో కొంటే నెలకు రూ.1194 నుంచి చెల్లించాల్సి ఉంటుంది.