పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. ఆ సంఖ్యల ఆధారంగా సంబంధిత వ్యక్తులకు ఎదురుకాబోయే ప్రమాదాలు, శుభాలను న్యూమరాలజీ(Numerology) నిపుణులు అంచనా వేస్తుంటారు. పుట్టిన తేదీనే కాకుండా వినియోగిస్తున్న మొబైల్ నంబర్(Mobile Number) ప్రభావం కూడా మనుషులపై ఉంటుందని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
నంబర్లు రిపీట్ కాకూడదు మొబైల్ నంబర్లోని అంకెలు అన్నింటినీ కలిపితే వచ్చే సంఖ్య ఫ్రెండ్లీ నంబర్ అయి ఉండాలి. అన్ని అంకెలను కలుపుతున్నప్పుడు 4, 7, 8ని పక్కనపెట్టాలి. అదే విధంగా మొబైల్ నంబర్లో అంకెలు రిపీట్ కాకుండా చూసుకోవాలి. నంబర్లు రిపీట్ అయితే గ్రహ శక్తి ప్రభావితం అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)