Vaccine Certificate: మీ వ్యాక్సిన్​ సర్టిఫికెట్​లో తప్పులున్నాయా.. ఇలా సరి చేసుకోండి...

కొంత మంది వ్యాక్సిన్​ సర్టిఫికెట్ల​లో పేరు, పుట్టిన తేదీ, లింగం వంటి తప్పులు వస్తున్నాయి. తద్వారా ఈ సర్టిఫికెట్లు చూపించి దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలకు సిద్ధమయ్యే వారు ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారి ఇబ్బందులను గుర్తించి కొవిన్​ యాప్​లో కొత్త ఫీచర్​ను చేర్చింది కేంద్ర ప్రభుత్వం. సులభంగా వాటిని సరిచేసుకునే అవకాశం కల్పిస్తోంది.