ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అమెజాన్ ఎయిర్ని ప్రారంభించడం భారతీయ ఇ-కామర్స్ పరిశ్రమలో మరో ముందడుగని పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు తన భవిష్యత్ కార్యక్రమాలలో రాష్ట్ర ప్రభుత్వం నుండి అమెజాన్‌కు అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. దీని ద్వారా అమెజాన్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంతోపాటు కస్టమర్లకు వేగంగా డెలివరీ చేయగలుగుతామని చెప్పారు.
హైదరాబాద్ పట్ల అమెజాన్ ప్రేమ కొనసాగుతోందని అన్నారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. గ్లోబల్ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్లో అమెజాన్ తన డైరెక్ట్ సెల్లర్స్ జాబితాలో ఎక్కువ మంది కళాకారులు, చేనేత మరమగ్గాలను చేర్చుకోవడం కొనసాగించాలని ఈ మేరకు మంత్రి ఆకాంక్షించారు. ప్రస్తుతం.. అమెజాన్ తెలంగాణ చేనేత శాఖతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా 56 గ్రామాల్లో 4500 మంది నేత కార్మికులకు సహాయం చేస్తోంది. ప్రగతిశీల చర్యల వల్ల తెలంగాణలో ఏవియేషన్, ఏరోస్పేస్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి అన్నారు. RGIA వద్ద విమాన ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతోందని .. 2028 నాటికి ఇది 40 మిలియన్ల మార్కును చేరుకుంటుందని.. 2020-21లో ఎయిర్ కార్గో ట్రాఫిక్ కూడా 35 శాతం పెరిగిందని ఆయన చెప్పారు. హైదరాబాద్ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్పోర్ట్ అని చెప్పారు. హైదరాబాద్ గ్రీన్‌సిటీ అవార్డును సొంతం చేసుకున్నదని తెలిపారు.
గత ఏడేండ్లుగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా రూ.36,300 కోట్ల పెట్టుబడులు పెడుతున్నదని చెప్పారు.ఏవియేషన్ రంగంలో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని వెల్లడించారు. ఈ సందర్భంగా.. అమెజాన్ బృందాన్నికేటీఆర్ అభినందించారు. ఇండియాలో అమెజాన్ ఎయిర్ సర్వీసులు ప్రారంభించటం పట్ల ఐటీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ పట్ల అమెజాన్ ప్రేమ కొనసాగుతోందని అన్నారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.