1. భారత్‌లో స్మార్ట్ వాచ్, ఫిట్నెస్ బ్యాండ్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. కరోనా తర్వాత ఆరోగ్య సంరక్షణపై సృహ పెరగడంతో ఫిట్నెస్ బ్యాండ్ల (Fitness Band) కొనుగోళ్లు మరింతగా పెరిగాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని చైనీస్ స్మార్ట్ దిగ్గజం షావోమీ ఇటీవల ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 6 (Mi Smart Band 6) పేరుతో స్మార్ట్‌బ్యాండ్‌ను లాంచ్ చేసింది. (image: Xiaomi India)
4. ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 6 ఫీచర్స్ చూస్తే ఇందులో 1.56 అంగుళాల AMOLED డిస్ప్లేను అందించారు. ఎంఐ బ్యాండ్ 5 కంటే ఇది చాలా పెద్ద డిస్ప్లేగా చెప్పవచ్చు. ఇది 1.1 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లేతో వస్తుంది. దీన్ని పిల్ షేప్ ప్యానెల్‌తో డిజైన్ చేశారు. ఇది స్విమ్మింగ్, స్ట్రోక్ కౌంట్, డిస్టెన్స్.. ఇలా 30కి పైగా స్పోర్ట్స్ యాక్టివిటీస్‌ను ట్రాక్ చేయగలదు. (image: Xiaomi India)