1. షావోమీ ఇండియా 8వ యానివర్సరీ సందర్భంగా ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ సేల్ (Mi Fan Festival Sale) ప్రారంభించింది. ఈ సేల్ ఏప్రిల్ 12 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో ప్రతీ రోజు సాయంత్రం 4 గంటలకు ఒక్క రూపాయికే ప్రొడక్ట్స్ కొనొచ్చు. ఏప్రిల్ 7న రెడ్మీ 9ఏ స్పోర్ట్ మోడల్‌ను కేవలం రూ.99 ధరకే సొంతం చేసుకోవచ్చు. (image: Xiaomi India)
2. రెడ్మీ 9ఏ స్పోర్ట్ స్మార్ట్‌ఫోన్ 2జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.6,999 కాగా, 3జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,299. ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.99 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఏప్రిల్ 7 సాయంత్రం 4 గంటలకు ఫ్లాష్ సేల్ ప్రారంభం అవుతుంది. (image: Xiaomi India)
3. ఫ్లాష్ సేల్‌లో కేవలం కొన్ని యూనిట్స్ మాత్రమే అమ్ముతుంది షావోమీ. కాబట్టి ఈ సేల్ క్షణాల్లో ముగుస్తుంది. ఈ సేల్‌లో పాల్గొనాలనుకునేవారు ముందుగానే లాగిన్ చేసి సిద్ధంగా ఉండాలి. ఫ్లాష్ సేల్ ప్రారంభం కాగానే ఆర్డర్ ప్లేస్ చేసేందుకు ప్రయత్నిచాలి. 99 స్టోర్‌లో ప్రతీ రోజూ కొన్ని ప్రొడక్ట్స్‌ని రూ.99 ధరకు అమ్ముతుంది షావోమీ. (image: Xiaomi India)