1. షావోమీ ఇండియా గతేడాది ఎంఐ 11ఎక్స్ ప్రో (Mi 11X Pro) స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రిలీజ్ ధరతో పోలిస్తే ఏకంగా రూ.10,000 డిస్కౌంట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తోంది. ఇటీవల స్మార్ట్‌ఫోన్ ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ గతంలో రిలీజ్ అయిన స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్‌తో లభిస్తుండటం విశేషం. (image: Xiaomi India)
2. రిలీజ్ అయినప్పుడు ఎంఐ 11ఎక్స్ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ ధరలు చూస్తే 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999 కాగా, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.41,999. ఏకంగా రూ10,000 డిస్కౌంట్‌తో ఎంఐ 11ఎక్స్ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.29,999 ధరకు, 8జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.31,999 ధరకు కొనొచ్చు. (image: Xiaomi India)
4. ఎంఐ 11ఎక్స్ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్ హెచ్ హెచ్డీ+ ఈ4 అమొలెడ్ డాట్ డిస్ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది. సన్‌లైట్ డిస్ప్లే 3.0, ఎస్జీఎస్ ఐకేర్ డిస్ప్లే, 360 డిగ్రీల యాంబియంట్ లైట్ సెన్సార్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Xiaomi India)
5. ఎంఐ 11ఎక్స్ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. సాంసంగ్ గెలాక్సీ ఎస్21 సిరీస్, ఏసుస్ జెన్‌ఫోన్ 8 సిరీస్, వివో ఎక్స్70 ప్రో ప్లస్, వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 స్మార్ట్ఫోన్లలో కూడా ఇదే ప్రాసెసర్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. (image: Xiaomi India)
6. ఎంఐ 11ఎక్స్ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 108 మెగాపిక్సెల్ సాంసంగ్ హెచ్ఎం2 సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ మ్యాక్రో షూటర్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. రియర్ కెమెరాలో ఏఐ కెమెరా 6.0, నైట్ మోడ్ 2.0, మ్యాజిక్ జూమ్, స్లో షటర్, టైమ్ ఫ్రీజ్, నైట్ టైమ్ ల్యాప్స్, ప్యారలల్ వాల్డ్, ఫ్రీజ్ ఫ్రేమ్ వీడియో లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Xiaomi India)
7. ఎంఐ 11ఎక్స్ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండటం విశేషం. ఇందులో ఎంఐ 11ఎక్స్ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 4,520ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 2.5వాట్ వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఎంఐ 11ఎక్స్ ప్రో స్మార్ట్‌ఫోన్‌ను సెలెస్టియల్ సిల్వర్, కాస్మిక్ బ్లాక్, లూనార్ వైట్ కలర్స్‌లో కొనొచ్చు. (image: Xiaomi India)