ఇవి 7 సీటర్ లగ్జరీ SUVలు. వీటిలో మెర్సీడెజ్-బెంజ్ GLB... పెట్రోల్, ఎలక్ట్రిక్ పవర్ట్రైన్ ఆప్షన్స్‌తో లభిస్తోంది. దీని ధర రూ.63.8 లక్షల నుంచి రూ.69.8 లక్షలుగా ఉండగా.. కంప్లీట్ ఎలక్ట్రిక్ వెర్షన్ అయిన మెర్సీడెజ్-బెంజ్ EQB 300 ఎక్స్ షోరూమ్ ధర రూ.74.5 లక్షలుగా ఉంది. (image credit - www.mercedes-benz.com)
మెర్సీడెజ్-బెంజ్ GLB... చూడటానికి బేబీ GLSలా ఉంటుంది. ఫ్రంట్‌లో సింగిల్ స్లాట్ గ్రిల్ ఉంది. స్క్వేర్ LED హెడ్ ల్యాంప్స్.. స్ల్పిచ్ LED టైల్ లైట్స్ ఉన్నాయి. క్యాబిన్లో ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కోసం రెండు స్క్రీన్స్ ఉన్నాయి. ఇన్ఫోటైన్మెంట్ సిస్టం.. లేటెస్ట్ జనరేషన్ MBUX ఇంటర్ఫేస్తో ఉంది. ఈ మోడల్లో వెంటిలేటెడ్ పవర్ సీట్స్ ఉన్నాయి. అలాగే పానోరామిక్ సన్‌రూఫ్, కార్ప్లే. ఆటో కనెక్టివిటీ, 7 ఎయిర్‌బ్యాగ్స్ ఇలా ఎన్నో ఉన్నాయి. మూడో వరుసలో సీట్లు కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. (image credit - www.mercedes-benz.com)
కొత్త మెర్సీడెజ్-బెంజ్ GLB... మూడు వేరింట్లలో లభిస్తోంది. అవి 200, 220d, 220d 4MATIC. GLB 200కి 1.3 లీటర్ల టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 250 NM టార్క్ వద్ద 161 bhp పవర్ ఇస్తుంది. అలాగే 220d, 220d 4MATIC లకు 2.0 లీటర్ల టర్బోచార్జ్డ్ ఇంజిన్ ఉంది. ఇది 400 NM టార్క్ వద్ద 188 bhp పవర్ ఇస్తుంది. ట్రాన్స్మిషన్ ఆప్షన్ ఉన్నాయి. పెట్రోల్‌కి 7 స్పీడ్ ఆటోమేటిక్ ఉండగా... డీజిల్ వెర్షన్‌కి 8 స్పీడ్ డ్యూయ్ క్లచ్ ఆటోమేటిక్ ఉంది. మెర్సీడెజ్-బెంజ్ EQB అనేది.. GLBకి ఎలక్ట్రిక్ వెర్షన్. రెండు మోడల్స్‌లో చాలా ఆప్షన్స్ ఒకేలా ఉన్నాయి. రెండింటినీ తేలిగ్గా గుర్తించవచ్చు. EQBలో.. బ్లాక్డ్ అవుట్ క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్ ఉంది. అలాగే.. హెడ్ లైట్స్‌కి LED స్ట్రిప్ కనెక్ట్ అయివుంది. ఈ కార్లకు ఉన్న 18 అంగుళాల అలాయ్ వీల్స్, చంకీ రెడ్ బార్, టైల్ గేట్, స్ల్పిట్ LED టైల్ లైట్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. (image credit - www.mercedes-benz.com)
పవర్ విషయానికొస్తే.. మెర్సీడెజ్-బెంజ్ EQBలో సింగిల్ ఎలక్ట్రిక్ మోటర్ ఉంది. ఇది 390 NM టార్క్ వద్ద 225 bhp పవర్ ఇస్తుంది. ఈ కారు మోటర్.. 66.5 kWh బ్యాటరీ ప్యాక్ కలిగివుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే.. 423 కిలోమీటర్ల దాకా వెళ్తుందని తేల్చారు. ఈ బ్యాటరీ.. 32 నిమిషాల్లో 80 శాతం ఛార్జింగ్ అవుతుంది. ఇందుకోసం 110 kW DC ఫాస్ట్ ఛార్జర్ అవసరం. అదే 11 kW AC చార్జర్ అయితే.. 6.5 గంటల్లో ఛార్జ్ అవుతుంది. బ్యాటరీ ప్యాక్‌పై కంపెనీ.. 8 ఏళ్ల వారంటీ ఇస్తోంది. అలాగే GLBలో ఇంజిన్, ట్రాన్స్మిషన్కి కూడా 8 ఏళ్ల వారంటీ ఉంది. ఈ రెండు SUVలూ ఇండియాకి కంప్లీట్ బిల్ట్ యూనిట్ (CBU)గా ఇండియాకి వస్తాయి. రెండు కార్లకూ బుకింగ్స్ మొదలయ్యాయి. (image credit - www.mercedes-benz.com)