ఒక్కసారి ఎనీ డెస్క్ మీ ఫోన్ లేదా ల్యాప్ టాప్‌లో ఇన్స్టాల్ చేసి, ఆ కోడ్ అవతలి వ్యక్తికి చెబితే మీ డివైజ్ వారి కంట్రోల్లోకి వెళ్లిపోతుంది. అందువల్ల మీరు ఇలాంటి రిమోట్ యాక్సెస్ యాప్స్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోతే అవి తిరిగి వస్తాయో లేదో మనకు తెలీదు. ఒకవేళ వస్తాయని తెలిసినా ఎన్ని రోజులు పడుతుందో చెప్పడం కష్టమే.