MAHINDRA OFFERS HUG DISCOUNTS ON BOLERO SCORPIO XUV300 KUV100 NXT MARAZZO CARS HERE OFFER DETAILS NS
కారు కొనాలనుకుంటున్న వారికి Mahindra శుభవార్త.. ఈ మోడల్స్ పై రూ.80 వేల వరకు డిస్కౌంట్లు.. వివరాలివే
Mahindra Cars: మహింద్రా Bolero, Scorpio, XUV300, KUV100 NXT, Marazzo, Alturas G4 కార్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కొత్తగా కారు కొనాలనుకుంటున్న వారికి ప్రముఖ మహీంద్రా సంస్థ శుభవార్త చెప్పింది. ఎంపిక చేసిన కార్లపై భారీగా డిస్కౌంట్లను ప్రకటించింది. 80 వేల రూపాయల భారీగా ఆఫర్ ప్రకటించింది. మే 2022లో మహీంద్రా అందిస్తున్న అతిపెద్ద తగ్గింపు ఇదే. ఈ నెలాఖరు వరకు వినియోగదారులకు ఈ సౌకర్యం ఉంటుంది.
2/ 8
Bolero, Scorpio, XUV300, KUV100 NXT, Marazzo, Alturas G4 లపై మహీంద్రా ఈ ఆఫర్లన్నింటినీ అందిస్తోంది. కానీ కంపెనీ యొక్క ప్రసిద్ధ Mahindra Thar మరియు XUV700 తదితర మోడల్స్ పై ఆఫర్లు అందించలేదు.
3/ 8
Mahindra Bolero: కస్టమర్లకు ఇష్టమైన కొత్త బొలెరో కొనుగోలుపై మహీంద్రా రూ. 19,000 వరకు ఆఫర్ చేస్తుంది. దీనిపై రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కస్టమర్లకు అందజేస్తోంది. రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపు ఉంటుంది.
4/ 8
Mahindra KUV100 NXT: ఈ చిన్న మోడల్ SUVపై రూ. 37,190 వరకు ఆఫర్ ఉంది. రూ. 3,000 వరకు కార్పొరేట్ తగ్గింపులు మరియు రూ. 20,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కలిగి ఉంటుంది.
5/ 8
Mahindra XUV300: ఈ కారులో మొత్తం రూ.46,581 వరకు ఆఫర్ ఉంది. ఇందులో రూ.7,581 వరకు నగదు తగ్గింపు ఉంటుంది. అంతేకాకుండా ఇంకా ఉచిత ఉపకరణాలు. ఎక్స్చేంజ్ ఆఫర్, కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి.
6/ 8
Mahindra Scorpio: కస్టమర్లకు ఇష్టమైన స్కార్పియో ఎస్‌యూవీపై మహీంద్రా మొత్తం రూ.27,320 ఆఫర్ చేస్తోంది. వీటిలో రూ.13,320 వరకు ఉచిత యాక్సెసరీలు, రూ.4,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి. ఇంకా ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉన్నాయి.
7/ 8
Mahindra Alturas G4: ఇది మహీంద్రా యొక్క అత్యంత ఖరీదైన SUV. ఈ మోడల్ పై కంపెనీ భారీ తగ్గింపును అందిస్తోంది. ఇంకా రూ. 50,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఉంది. రూ. 11,500 వరకు ఆఫర్ చేస్తాయి. కార్పొరేట్ డిస్కౌంట్లు, ఉచిత సాధనాలను కూడా అందిస్తోంది.
8/ 8
Mahindra Marazzo: మహీంద్రా మరాజో వాహనంపై రూ. 55,200 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. బేస్ M2 ట్రిమ్ రూ. 20,000 వరకు నగదు తగ్గింపును అందిస్తోంది. కంపెనీ కారుపై రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 5,200 వరకు కార్పొరేట్ తగ్గింపును అందిస్తోంది.