1. అమెజాన్‌లో ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ (Amazon Fab Phones Fest) సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ మే 27న ముగియనుంది. ఈ సేల్‌లో అన్ని బ్రాండ్ల స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ కంపెనీలు అందించే డిస్కౌంట్లతో పాటు బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కూడా పొందొచ్చు. (image: Lava Mobiles)
2. మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అయిన లావా మొబైల్స్ గతేడాది భారతదేశంలో తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. లావా అగ్ని 5జీ (Lava Agni 5G) పేరుతో ఈ మొబైల్‌ను పరిచయం చేసింది. లావా అగ్ని 5జీ రిలీజ్ ధర కన్నా రూ.4,500 తక్కువ ధరకే అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్‌లో సొంతం చేసుకోవచ్చు. (image: Lava Mobiles)
3. లావా అగ్ని 5జీ స్మార్ట్‌ఫోన్ కేవలం 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే రిలీజ్ అయింది. రిలీజ్ అయినప్పుడు ధర రూ.19,999. ఈ స్మార్ట్‌ఫోన్ ధరను భారీగా తగ్గించింది కంపెనీ. ప్రస్తుతం రూ.16,490 ధరలో ఈ మొబైల్ లిస్ట్ అయింది. ఇక అమెజాన్ సేల్‌లో బ్యాంక్ ఆఫర్‌తో రూ.15,490 ధరకు కొనొచ్చు. రిలీజ్ ధరతో పోలిస్తే రూ.4,500 తక్కువే. (image: Lava Mobiles)
4. లావా అగ్ని 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ రియల్మీ 9, రెడ్మీ నోట్ 11టీ, వివో వీ23ఈ 5జీ, రియల్మీ 8ఎస్ స్మార్ట్ఫోన్లలో ఉంది. (image: Lava Mobiles)
5. లావా అగ్ని 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. డ్యూయెల్ 5జీ సపోర్ట్ ఉంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. స్టాక్ ఆండ్రాయిడ్ 11 యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ యాప్స్ తప్ప ఇతర యాప్స్ ఉండవు. (image: Lava Mobiles)