1. స్మార్ట్‌ఫోన్... ప్రతీ ఒక్కరి చేతిలో కనిపించే గ్యాడ్జెట్. ఒకప్పుడు ఫోన్ అంటే కేవలం కాల్స్ మాట్లాడుకోవడానికి, మెసేజెస్ చేయడానికి మాత్రమే ఉపయోగపడేవి. కానీ స్మార్ట్‌ఫోన్స్ వచ్చిన తర్వాత ప్రతీ అవసరానికి ఈ గ్యాడ్జెట్ వాడాల్సిన పరిస్థితి ఉంది. బ్యాంకు లావాదేవీల దగ్గర్నుంచి ఆన్లైన్ మీటింగ్స్ వరకు అన్నీ స్మార్ట్‌ఫోన్‌లోనే. (ప్రతీకాత్మక చిత్రం)
4. స్మార్ట్‌ఫోన్ పోయినప్పుడు ముందుగా చేయాల్సిన పని సిమ్ కార్డ్ బ్లాక్ చేయడం. మీరు మీ టెలికాం సర్వీస్ కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి సిమ్ బ్లాక్ చేయమని చెప్పాలి. సిమ్ బ్లాక్ చేస్తే ఓటీపీలు ఫోన్‌కు రావు. కాబట్టి ఎవరైనా లావాదేవీలు చేద్దామని ప్రయత్నించినా అడ్డుకోవచ్చు. సిమ్ కార్డ్ బ్లాక్ చేసిన తర్వాత కొత్త సిమ్ కార్డు తీసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న ఫోన్ నెంబర్ బ్యాంకు అకౌంట్లకు లింక్ అయి ఉంటే మీరు బ్యాంకుకు కాల్ చేయాలి. మీ ఆన్లైన్ బ్యాంకింగ్ సేవల్ని నిలిపివేయాలని కోరాలి. బ్యాంకుకు వెళ్లి మీ అకౌంట్‌కు వేరే మొబైల్ నెంబర్ లింక్ చేయాలి. మీ అకౌంట్ పాస్వర్డ్ మొత్తం మార్చేయాలి. మీ ఫోన్ కాజేసినవాళ్లు బ్యాంకింగ్ యాప్స్ ఓపెన్ చేసినా లావాదేవీలు చేయలేరు. ఆ తర్వాత ఆ మొబైల్ నెంబర్‌కు లింక్ అయి ఉన్న యూపీఐ అకౌంట్లను కూడా డీయాక్టివేట్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)