గత కొన్ని వారాలుగా భారతదేశంలో చాలా కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి. వీటిలో వేర్వేరు ధరల విభాగాలకు చెందినవి ఉన్నాయి. టాప్ మొబైల్ బ్రాండ్లు రూ.20,000 లోపు కొత్త ఫోన్లను లాంచ్ చేశాయి. ఈ నెలలో రూ.20 వేల లోపు ఫోన్ కొనాలని చూస్తుంటే ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ల గురించి తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
* Samsung Galaxy M33 5G
శాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీ ఫోన్ వెనుక భాగంలో నాలుగు కెమెరాల సెటప్ ఉంటుంది. ఫోన్ 6.6 అంగుళాల డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, పైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఇందులో Exynos 1280 చిప్సెట్తో పని చేస్తుంది. ఇది 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, రెండు 2 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీలో సెల్ఫీలు తీసుకొనేందుకు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 6000mAh బ్యాటరీ ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీ బేస్ వేరియంట్ ధర రూ.18,999గా ఉంది. గ్రీన్, బ్లూ, బ్రౌన్ కలర్స్‌లో లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
* Motorola Moto G52
రూ.15,000 కంటే తక్కువ ధర ఉన్న ఫోన్లలో మోటరోలా మోటో జీ52 ఒకటి. ఆండ్రాయిడ్ 12పై రన్ అవుతుంది. 6.6 అంగుళాల AMOLED 90Hz డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్డ్రాటన్ 480 ప్రాసెసర్ ఉంది. ఇది 4G ఫోన్. ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్, 8 మెగాపిక్సెల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ సెన్సార్ ఉన్నాయి. అయితే ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. 5000mAh బ్యాటరీతో వస్తుంది. మోటరోలా మోటో జీ52 బేస్ వేరియంట్ రూ.14,499కు లభిస్తుంది. చార్కోల్ గ్రే, పింగాణీ వైట్ కలర్స్‌లో లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
Poco M4 Pro
పోకో ఎం4 ప్రో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43 అంగుళాల ఆల్మోడ్ డిస్ప్లే, పైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఇందులో ఆక్టా-కోర్ MediaTek Helio G96 ప్రాసెసర్, వెనుకవైపు ఉన్న కెమెరాలలో 64 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్, 8 మెగాపిక్సెల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. Android 11 ఆధారిత MIUI 13పై రన్ అవుతుంది. 5000mAh బ్యాటరీకి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ.14,999గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
వెనుకవైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, రెండు 2 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. ఒప్పో కే10 రివర్స్ ఛార్జింగ్, USB PD సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీతో పని చేస్తుంది. ఒప్పో కే10 బేస్ వేరియంట్ రూ.14,990గా ఉంది. బ్లాక్, బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)