ప్రస్తుతం చాలా స్మార్ట్ఫోన్లు అధిక బ్యాటరీ సామర్థ్యంతో.. ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే విధంగా రూపుదిద్దుకొంటున్నాయి. దీంతో యూజర్లు బ్యాటరీ బ్యాకప్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కువ బ్యాటరీ బ్యాకప్‌తో రూ.20,000 లోపు లభించే స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తుంటే.. ఈ ఫోన్లను పరిశీలించండి.. (ప్రతీకాత్మక చిత్రం)
REDMI NOTE 11S (RS 16,499, 6GB RAM, 64GB స్టోరేజ్)
Redmi Note 11 Pro తరహా స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరలో సొంతం చేసుకోవాలని ఎదురుచూస్తున్నవారికి Redmi Note 11S మంచి ఆప్షన్. 1.2 గంటల సమయంలోనే 33W ఛార్జర్‌తో ఫోన్ ఫుల్ ఛార్జ్ అవుతుంది. 12 గంటలపాటు పూర్తిగా HD వీడియోలు చూస్తే బ్యాటరీ లెవల్ 100 నుంచి కేవలం 60కి మాత్రమే పడిపోయింది. ఇది ఈ స్మార్ట్‌ఫోన్‌లో బాగా ఆకట్టుకొనే అంశం.
* MOTOROLA MOTO G71 5G (రూ.19,049, 6GB RAM, 128GB స్టోరేజ్)
మోటొరోలా స్మార్ట్ఫోన్లు క్లీన్ ఆండ్రాయిడ్ ఇంటర్ఫేస్, బ్యాటరీకి ప్రత్యేకం. మోటో G71 5G స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీతో వస్తుంది. 33w టర్బోపవర్ ఛార్జర్ కూడా అందిస్తారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే MOTOROLA MOTO G71 5G ఫోన్ 30 గంటలపాటు పని చేస్తుందని మోటొరోలా తెలిపింది.
SAMSUNG GALAXY F23 5G (రూ.17,499, 4GB RAM, 128GB స్టోరేజ్)
శ్యాంసంగ్ గెలాక్సీ F23 5G స్మార్ట్‌ఫోన్ కూడా 5,000mAh బ్యాటరీతో వస్తుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. అయితే ఈ ఫోన్‌తోపాటు ప్యాకేజీలో ఛార్జింగ్ అడాప్టర్ ఉండదు. ఫోన్‌ను ఒక్కాసరి ఛార్జ్ చేస్తే రోజంతా సాధారణ కార్యకలాపాలకు ఫోన్ వినియోగిస్తూ, తక్కువగా గేమ్స్ ఆడుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)