మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ కారు టాప్‌లో ఉందని చెప్పుకోవచ్చు. దీన్ని ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకంగా 857 కిలోమీటర్లు వెళ్తుంది. దీని రేటు రూ. 1.55 కోట్ల నుంచి రూ. 2.45 కోట్ల మధ్యలో ఉంది. ఇందులో రెండు వేరియంట్లు ఉంటాయి. కంపెనీ ఈ కారులో 107.8 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చింది. ఫాస్ట్ చార్జింగ్ ద్వారా అయితే 30 నిమిషాల్లోనే బ్యాటరీ 80 శాతం వరకు ఫుల్ అవుతుంది.