Jio, Airtel, Vi అందించే ఈ డేటా బూస్టర్ ప్లాన్ల గురించి మీకు తెలుసా..? కేవలం రూ. 15 నుంచే..
Jio, Airtel, Vi అందించే ఈ డేటా బూస్టర్ ప్లాన్ల గురించి మీకు తెలుసా..? కేవలం రూ. 15 నుంచే..
కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రంతో పాటు వివిధ కారణాల రిత్యా మొబైల్ డేటా వినియోగం విపరీతంగా పెరిగింది. దాదాపు అనేక మంది వైఫై కనెక్షన్ కలిగి ఉన్నా.. మొబైల్ డేటాపై అనేక సందర్భాల్లో ఆధార పడాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే.. చాలా సార్లు మనకు మొబైల్ డేటా అయిపోతుంది. ఆ సందర్భాల్లో తక్కువ ధరకు డేటా బూస్టర్ ప్యాక్ లు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో Jio, Airtel, Vodafone-Idea Viలు బెస్ట్ డేటా ప్యాక్ లు అందిస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Reliance Jio: రిలయన్స్ జియో నాలుగు డేటా బూస్టర్ ప్లాన్లను అందిస్తుంది. ఇందులో రూ. 15 ప్లాన్ ద్వారా 1 GB డేటా, రూ.25 ప్లాన్‌లో 2 జీబీ డేటా మరియు రూ.61 మరియు రూ.121 ప్లాన్‌తో 12 జీబీ డేటా లభిస్తుంది.
2/ 6
దీంతో పాటు జియో వర్క్ ఫ్రం హోం(Work From Home) ప్లాన్లను కూడా అందిస్తోంది. రూ.181 ప్లాన్ తో 30 జీబీ డేటా లభిస్తుంది. వ్యాలిడిటీ 30 రోజులు. రూ.241కి 40 జీబీ, రూ.301కి 50 జీబీ డేటా లభిస్తాయి.
3/ 6
Airtel: ఎయిర్టెల్ రూ.58 ప్లాన్‌తో 3GB డేటాను అందిస్తోంది. వినియోగదారులు వింక్ మ్యూజిక్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను రూ. 98కి 5 GB డేటా ప్లాన్‌లో పొందవచ్చు. ఇది కాకుండా మీరు 108 రూపాయలకు 6 GB డేటాను కూడా పొందుతారు. ఉచిత హలో ట్యూన్లు మరియు ఇతర ప్రయోజనాలు ఉంటాయి.
4/ 6
Airtel 12 GB డేటా బూస్టర్ ప్లాన్‌ను రూ. 118 మరియు 15 GB డేటా బూస్టర్ ప్లాన్‌ను రూ. 148కు అందుకోవచ్చు. అతిపెద్ద ప్లాన్ రూ. 301, దీనిలో మీరు 50 GB అదనపు డేటాను పొందవచ్చు.
5/ 6
Vodafone-Idea: వొడాఫోన్ నుంచి రూ.19కి మీకు 24 గంటల పాటు 1 జీబీ డేటా లభిస్తుంది. రూ.48కి 21 రోజుల పాటు 2జీబీ డేటా లభిస్తుంది. రూ.58 ప్లాన్‌లో 28 రోజుల పాటు 3 జీబీ డేటా, రూ.98 ప్లాన్‌కు 21 రోజుల పాటు 9 జీబీ డేటా లభిస్తుంది.
6/ 6
అదనంగా, రూ.118 పథకం 28 రోజుల పాటు 12 GB డేటాను అందిస్తుంది. రూ.298కి 28 రోజులకు 50 జీబీ డేటా, రూ.418కి 56 రోజులకు 100 జీబీ డేటా లభిస్తుంది.