జీ ఎంటర్టైన్ ఎంటర్ప్రైజెస్ (జీ), కల్వేర్ మ్యాక్స్ ఎంటరటైన్మెంట్ (సోనీ), సన్ టీవీ నెట్వర్క్ వంటివి ఇప్పటికే రెఫరెన్స్ ఇంటర్కనెక్ట్ ఆఫర్స్ (ఆర్ఐఓ)ను దాఖలు చేశాయి. ఆర్ఓఐ అంటే సర్వీస్ ప్రొవైడర్ జారీ చేసిన నియమ నిబంధనల పత్రం. ఒక సర్వీస్ ప్రొవైడర్ మరో నెట్వర్క్తో ఇంటర్కనెక్షన్ కోరుకునే నిబంధనలు, షరతులు ఇందులో ఉంటాయి. డిస్నీ స్టార్ ఇండియా, వయాకామ్ 18 వంటివి కూడా త్వరలోనే ఆర్ఐఓలను దాఖలు చేసే అవకాశం ఉంది.
బ్రాడ్ కాస్టర్లు ధరలు పెంచడం వల్ల ఆ ప్రభావం పే టీవీ ఇండస్ట్రీ పైన ఉండే అవకాశం ఉందని టీవీ డిస్ట్రిబ్యూష్ సర్వీస్ ప్రొవైడర్లు భయపడుతున్నారు. ఇప్పటికే డీడీ ఫ్రీ డిష్ ప్రసార్ భారతీ ఫ్రీ డైరెక్ట్ టు హోమ్ ప్లాట్ఫామ్, ఓవర్ ద టాప్ (ఓటీటీ) ప్లాట్పామ్స్ నుంచి ఇప్పటికే ఈ విభాగం తీవ్ర పోటీని ఎదుర్కోంటోంది.
’అయితే ఇప్పుడు సోనీ, జీ చాలా ఛానళ్ల ధరలను పెంచేశాయి. కొన్ని బౌక్వెట్స్ ధరలు 10 నుంచి 15 శాతం మేర పైకి కదిలాయి. కొన్ని సందర్భాల్లో అయితే ధరల పెంపు ఇంకా ఎక్కువగానే ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. సోనీ తన బేస్ బౌక్వెట్ను నిలిపివేసిందని తెలిపారు. దీని రేటు రూ. 31గా ఉండేది. దీని స్థానంలో కొత్త బౌక్వెట్ తెచ్చిందని పేర్కొన్నారు. ఇప్పుడు దీని రేటు రూ. 43గా ఉందని తెలిపారు.