1. మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అయిన లావా ఇంటర్నేషనల్ 5జీ స్మార్ట్‌ఫోన్ (5G Smartphone) లావా బ్లేజ్ 5జీ (Lava Blaze 5G) మోడల్‌ను పరిచయం చేసింది. న్యూ ఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఎగ్జిబిషన్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లావా బ్లేజ్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించారు. (image: Lava Mobiles)
2. దీపావళి లోగా లావా బ్లేజ్ 5జీ స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. మేడ్ ఇన్ ఇండియా 5G స్మార్ట్‌ఫోన్ తయారు చేయాలన్నది తమ కోరిక అని, ఈ ప్రొడక్ట్ భారతీయులకు నెక్స్ట్ జనరేషన్ 5జీ టెక్నాలజీ అందించేందుకు ఈ ప్రొడక్ట్ ఉపయోగపడుతుందని, తక్కువ ధరకే ఇది లభిస్తుందని లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రెసిడెంట్, బిజినెస్ హెడ్ సునీల్ రైనా తెలిపారు. (image: Lava Mobiles)
3. లావా బ్లేజ్ 5జీ స్మార్ట్‌ఫోన్ ధర రూ.10,000 లోపే ఉంటుందని అంచనా. ఫీచర్స్ చూస్తే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 3జీబీ వర్చువల్ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఫోటోగ్రఫీ కోసం 50మెగాపిక్సెల్ ఏఐ ట్రిపుల్ రియర్ కెమెరా, 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. (image: Lava Mobiles)
4. లావా బ్లేజ్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 90Hz రిఫ్రెష్ రేట్2తో 6.5అంగుళాల హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. అల్ట్రా ఫాస్ట్ ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. దాదాపు అన్ని 5జీ బ్యాండ్స్ సపోర్ట్ లభిస్తుంది. వెనుకవైపు గ్లాస్ బ్యాక్ డిజైన్ ఉంటుంది. (image: Lava Mobiles)
5. లావా బ్లేజ్ 5జీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన పూర్తి ఫీచర్స్ తెలియాల్సి ఉంది. ధర కూడా తెలియాలి. అయితే రూ.10,000 లోపే తీసుకొస్తామని కంపెనీ ప్రకటిస్తుండటం విశేషం. రూ.10,000 లోపు 5జీ స్మార్ట్ఫోన్లు ఇండియాలో ఎక్కువగా లేవు. కాబట్టి రూ.10,000 లోపు 5జీ మొబైల్ కొనాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్ కానుంది. (image: Lava Mobiles)
6. ఇక లావా నుంచి బ్లేజ్ సిరీస్‌లో లావా బ్లేజ్ ప్రో, లావా లావా బ్లేజ్ ఉన్నాయి. గతేడాది లావా నుంచి తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ లావా అగ్ని 5జీ రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ.15,999. ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Lava Mobiles)
7. లావా అగ్ని 5జీ మొబైల్లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్, 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. రూ.20,000 లోపు సెగ్మెంట్లోని ఇతర కంపెనీల మోడల్స్‌కు లావా అగ్ని 5జీ పోటీ ఇస్తోంది. (image: Lava Mobiles)