30 లేదా 31 రోజుల వ్యాలిడిటీతో కనీసం ఒక ప్రీపెయిడ్ ప్లాన్‌ని వినియోగదారులకు అందించాలని ట్రాయ్(TRAI)టెలికాం ఆపరేటర్లను కోరిన కొన్ని నెలల తర్వాత వోడాఫోన్ ఐడియా ఈ కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అదే తేదీలో రెన్యువల్ అయ్యే ప్లాన్లను క్యాలెండర్ నెల వాలిడిటీ ప్లాన్లు అంటారు. క్యాలెండర్ నెల ప్రీపెయిడ్ ప్లాన్ ఎంచుకుంటే.. నంబర్‌ను ఒకేసారి రీఛార్జ్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
రూ.327 ప్రీపెయిడ్ ప్లాన్‌ను 30 రోజుల వ్యాలిడిటీతో వోడాఫోన్ ఐడియా అందిస్తోంది. ఇది రోజుకు 100 SMSలతో పాటు మొత్తం 25GB ఇంటర్నెట్ డేటాను అందిస్తుంది. ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 100 SMS లను కూడా అందిస్తుంది. దానితో పాటు ప్రీపెయిడ్ ప్లాన్ అపరిమిత వాయిస్ కాల్స్, Vi మూవీస్, టీవీ సబ్‌స్క్రిప్షన్‌కు ఉచిత సభ్యత్వం అవకాశాలను కల్పిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
ప్రీపెయిడ్ ప్లాన్ ఎక్కువ కాలం వ్యాలిడిటీ వ్యవధిని అందిస్తున్నప్పటికీ, ఇది రోజువారీ డేటా ప్రయోజనాలను అందించదు. సబ్స్క్రైబర్లు మొత్తం 25GB డేటాను పొందుతారు. ఇది ఒక నెలకు సరిపోతుంది. కానీ అధికంగా ఇంటర్నెట్ డేటా అవసరమైన వారు రోజువారీ డేటా ప్రయోజనాలను అందించే ప్రీపెయిడ్ ప్లాన్లను ఎంచుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
* రిలయన్స్ జియో ఒక నెల ప్రీపెయిడ్ ప్లాన్
రిలయన్స్ జియో కూడా ఒక నెల వ్యాలిడిటీతో ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ధర రూ.259. ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 1.5GB ఇంటర్నెట్ డేటాను అందిస్తుంది. రోజువారీ ఇంటర్నెట్ డేటాను వినియోగించిన అనంతరం.. 64kbps వేగంతో ఇంటర్నెట్ను బ్రౌజ్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
* ఎయిర్టెల్ ఒక నెల ప్రీపెయిడ్ ప్లాన్ ... జియోతో పాటు ఎయిర్టెల్ కూడా ఒక నెల మొత్తం వ్యాలిడిటీతో ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. ఎయిర్టెల్ కూడా రూ.296, రూ. 310 ధరతో రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ. 296. ప్రీపెయిడ్ ప్లాన్ మొత్తం 25GB ఇంటర్నెట్ డేటాను వినియోగదారులకు MBకి 50 పైసలు చచొప్పున ఛార్జ్ చేసి అందిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ ప్లాన్ అపరిమిత కాల్స్, రోజుకు 100 SMS లను కూడా అందిస్తుంది. సాధారణ ప్రయోజనాలతో పాటు ఈ ప్లాన్ అమెజాన్ ప్రైమ్ వీడియోల మొబైల్ ఎడిషన్ 30-రోజుల ఉచిత ట్రయల్, 3 నెలల అపోలో 24/7 సర్కిల్ సదుపాయాలు కల్పిస్తుంది. మరో ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ.310. ఈ ప్లాన్ 30 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఇది రోజుకు 2GB రోజువారీ డేటాను అందిస్తుంది. కాబట్టి వినియోగదారులు సాధారణంగా నెలను బట్టి 56GB నుంచి 62GB డేటాను పొందుతారు. (ప్రతీకాత్మక చిత్రం)