మోటొరోలా (Motorola) కంపెనీ ఇండియన్ మార్కెట్లో బడ్జెట్, మిడ్‌రేంజ్ ఫోన్లను వరుసగా రిలీజ్ చేస్తోంది. తాజాగా ఈ సంస్థ మోటో ఈ32ఎస్ (Moto E32s) పేరుతో మరో కొత్త బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను గురువారం ఇండియాలో లాంచ్ చేసింది. ఈ విభాగంలో తాజా డివైజ్ బెస్ట్ మోడల్‌గా నిలుస్తుందని మోటొరోలా వెల్లడించింది. కొత్త ఫోన్ మీడియాటెక్ చిప్సెట్తో వస్తుంది. ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వెర్షన్‌తో నడుస్తుంది. మంచి రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో డివైజ్ లాంచ్ అయింది. సాధారణంగా చౌక ఫోన్ల డిజైన్ విషయంలో కంపెనీలు తగినంత శ్రద్ధ తీసుకోవు. అయితే మోటో E32s మాత్రం ఇందుకు మినహాయింపుగా కనిపిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
* మోటో ఈ32ఎస్ ధర
ఇండియాలో మోటొరోలా మోటో E32s బేస్ వేరియంట్ ధర రూ.9,299గా ఉంది. అయితే ఇంట్రడ్యూసరీ ఆఫర్లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.8,999కి సొంతం చేసుకోవచ్చు. ఈ కంపెనీ 4GB + 64GB మోడల్‌ను కూడా లాంచ్ చేసింది. ఇది రూ. 9,999 వద్ద అందుబాటులో ఉంటుంది. ఇండియాలో కొత్త ఫోన్ సేల్స్ జూన్ 6 నుంచి ప్రారంభమవుతాయి. ఆన్లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ చానల్స్ ద్వారా Moto E32sను కొనుగోలు చేయవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)