ప్రపంచంలో ఎన్ని కార్ల కంపెనీలు ఉన్నా.. లంబోర్గినీ కార్ల స్టైలే వేరు. అవి ఎప్పుడు లాంచ్ అయినా.. విపరీతమైన డిమాండ్ ఉంటుంది. తాజాగా ఈ కంపెనీ రెవెల్టో (Revuelto)ని లాంచ్ చేసింది. (image credit - Lamborghini)
2/ 9
ఇది మామూలు కారు కాదు.. మొదటి సూపర్ స్పోర్ట్స్ V12 హైబ్రీడ్ ప్లగ్-ఇన్ HPEV (హైడ్రోజన్ పవర్‌తో పనిచేసే ఎలక్ట్రిక్ వెహికిల్) (image credit - Lamborghini)
3/ 9
ఈ కారు ఎంత పవర్ఫుల్ అంటే.. ఇది జీరో నుంచి గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 2.5 సెకండ్లలోనే అందుకుంటుంది. (image credit - Lamborghini)
4/ 9
ఇలాంటి కారు రోడ్డుపై వెళ్తే.. దీని సౌండ్, లుక్ వల్ల.. అందరూ అలా చూస్తుండిపోతారు. (image credit - Lamborghini)
5/ 9
లంబోర్గినీ కంపెనీ 13 ఏళ్ల కిందట ఎవెంటాడోర్ కారును లాంచ్ చేసింది. మళ్లీ ఇప్పుడే కొత్త కారు తెచ్చింది. (image credit - Lamborghini)
6/ 9
ఈ కారు హైబ్రీడ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. దీనికి 3 ఎలక్ట్రిక్ మోటర్స్ ఉన్నాయి. అలాగే 3.8kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. (image credit - Lamborghini)
7/ 9
దీనికి 6.5 లీటర్ల L545 ఇంజిన్ ఉది. దాని బరువు 218 కేజీలు. ఇంజిన్ పవర్ 9,250rpm దగ్గర 825hp ఇస్తోంది. అలాగే 6,750rpm దగ్గర 725Nm మాగ్జిమం టార్క్ ఇస్తోంది. (image credit - Lamborghini)
8/ 9
ఈ కారుకు 8 స్పీడ్ డ్యూయల్ క్లచ్ గేర్ బాక్స్ ఉంది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 350 కిలోమీటర్లు. (image credit - Lamborghini)
9/ 9
ఈ కారు ధర ఇండియాలో రూ.10 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. 2023 నవంబర్ నాటికి ఈ కారు డెలివరీ మొదలవుతుందని భావిస్తున్నారు. (image credit - Lamborghini)