సదరు కస్టమర్ బ్యాంక్ వివరాలు సేకరించి అతడి అకౌంట్ నుంచి భారీ నగదును తస్కరించారు. ఈ నేపథ్యంలో ఎయిర్టెల్ కేవైసీ, ఓటీపీ మోసాల గురించి తన కస్టమర్ (Customer) లను మళ్లీ హెచ్చరించింది.మోసగాళ్లు ఎయిర్టెల్ ఎగ్జిక్యూటివ్‌ల ముసుగులో యూజర్ల బ్యాంక్ ఖాతాలను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఎయిర్టెల్ తెలిపింది.
ఈ తరహా కేటుగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. “బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి కాల్ చేస్తున్నట్లు లేదా మెసేజ్‌లు పంపిస్తున్నట్లు మోసగాళ్లు కస్టమర్లను సంప్రదించవచ్చు. తరువాత ఇప్పటికే ఉన్న బ్యాంక్ ఖాతాను అన్‌బ్లాక్ లేదా రెన్యువల్ చేస్తామని కస్టమర్ల ఖాతా వివరాలు లేదా ఓటీపీని అడగవచ్చు.
“ఒక కస్టమర్ మోసపూరితమైన యూపీఐ అప్లికేషన్లు డౌన్లోడ్ చేసినా.. లేదా ఫేక్ వెబ్సైట్లోకి వెళ్లినా అతడి బ్యాంకు వివరాలు ఇతరుల చేతిలో పడే ప్రమాదం ఉంది. ఈ తరహా వెబ్సైట్లలోకి వెళ్లగానే అవి అన్ని బ్యాంక్ వివరాలను, ఎంపిన్ నమోదు చేయమని అడుగుతాయి. ఒకవేళ ఆ వివరాలను వెల్లడిస్తే మోసగాడు మీ బ్యాంక్ వివరాలను పూర్తిగా యాక్సెస్ చేస్తాడు. తద్వారా మీ బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది.
కావున అనుమానాస్పద వెబ్సైట్లు, యాప్‌లకు వీలైనంత దూరంగా ఉండండి. ఈమెయిల్ ద్వారా లేదా ఈమెయిల్‌లోని అనుమానాస్పద లింక్‌పై క్లిక్ చేయకండి. మీ బ్యాంకు వివరాలను ఎవరితో షేర్ చేయకండి. ఆదాయపు పన్ను శాఖ, వీసా, మాస్టర్‌కార్డ్ వంటి అధికారుల నుంచి వచ్చినట్లు ఈమెయిల్ కనిపించినా వాటిని ఓపెన్ చేయకండి" అని విట్టల్ సూచించారు.
టెలికాం యూజర్లకు తరచుగా కేవైసీ వెరిఫికేషన్ పేరుతో ఫేక్ కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయి. కేవైసీ వెరిఫై చేయకపోతే యూజర్లు 24 గంటల్లో తమ నంబర్‌కు యాక్సెస్ కోల్పోతారని నకిలీ మెసేజ్‌లు వస్తున్నాయి. ఐతే యూజర్లు స్కామ్ మెసేజ్‌లు సులభంగా గుర్తించవచ్చు. ఎందుకంటే ఆ స్కామ్ మెసేజ్‌ల్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. "మీ ఈకేవైసీ వివరాలు/ఆధార్ నంబర్‌ను షేర్ చేయమని, ఏదైనా యాప్‌ని డౌన్లోడ్ చేయమని ఎయిర్టెల్ మిమల్ని ఎప్పుడూ అడగదు" అని ఇప్పటికే కంపెనీ తన కస్టమర్లను హెచ్చరించింది.