1. వాట్సప్... స్మార్ట్‌ఫోన్ యూజర్లకు తమ మొబైల్లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్ ఇది. ప్రపంచంలో దాదాపు అందరు స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ యాప్ ఉపయోగిస్తుంటారు. వాట్సప్ వచ్చిన కొత్తలో ఈ యాప్ ఒక ఆప్షనల్‌గా మాత్రమే ఉండేది. కానీ... ఇప్పుడు తప్పనిసరిగా ఉపయోగించాల్సిన యాప్స్ జాబితాలో వాట్సప్ (WhatsApp) కూడా టాప్‌లో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. అయితే చాలావరకు డ్యూయెల్ సిమ్ సపోర్ట్ చేసే మొబైల్స్ ఉండటంతో రెండు మొబైల్ నెంబర్స్ మెయింటైన్ చేసేవాళ్లు ఉంటారు. పర్సనల్ అవసరాలకు ఒకటి, ఆఫీస్ కాంటాక్ట్స్ కోసం మరొకటి... ఇలా రెండు సిమ్ కార్డులు మెయింటైన్ చేస్తుంటారు. కాబట్టి రెండు వాట్సప్ అకౌంట్స్ కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఒకప్పుడు ఒకే స్మార్ట్‌ఫోన్‌లో రెండు వాట్సప్ అకౌంట్స్ ఉపయోగించాలంటే థర్డ్ పార్టీ యాప్స్ (Third Party Apps) డౌన్లోడ్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ ఈ ఫీచర్ అందిస్తున్నాయి. షావోమీ, రియల్మీ, సాంసంగ్, ఒప్పో, వివో... ఇలా అన్ని స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ రెండు వాట్సప్ యాప్స్ ఉపయోగించే అవకాశాన్ని ఇస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. వాట్సప్ మాత్రమే కాదు... ఇతర యాప్స్‌ని కూడా రెండు అకౌంట్స్‌తో ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం డ్యూయెల్ యాప్స్ ఫీచర్‌ని అందిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఫీచర్ పేరు వేర్వేరుగా ఉండొచ్చు. కానీ ఉపయోగం మాత్రం ఒకటే. ఒకే యాప్‌ను రెండు యాప్స్‌గా ఉపయోగించడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. మరి మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఫీచర్ ఎలా వాడుకోవాలో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. షావోమీ యూజర్స్ అయితే Dual Apps, ఒప్పో యూజర్లు Clone Apps, సాంసంగ్ యూజర్లు Dual Messenger, వివో యూజర్లు App Clone, ఏసుస్ యూజర్లు Twin Apps ఆప్షన్ కోసం సెర్చ్ చేయాలి. ఆ తర్వాత మీరు క్లోన్ చేయాలనుకుంటున్న యాప్ పేరు సెలెక్ట్ చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
7. అంటే మీరు ఒక మొబైల్ నెంబర్‌తో వాట్సప్ అకౌంట్లో లాగిన్ అయిన తర్వాత రెండో నెంబర్ ఉపయోగించడానికి కుదరదు. రెండో యాప్ ఇన్స్టాల్ చేయాల్సిందే. ఇవే సెట్టింగ్స్ ఫాలో అవుతు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి యాప్స్‌ని కూడా డ్యూయెల్ యాప్స్‌గా ఉపయోగించుకోవచ్చు. వీటిలో ప్రైమరీ అకౌంట్ ఏదో, సెకండరీ అకౌంట్ ఏదో గుర్తించడానికి యాప్ ఐకాన్‌లో చిన్న మార్పు కూడా ఉంటుంది. కాబట్టి ఈజీగా గుర్తించొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)