1. మీ స్మార్ట్‌ఫోన్ పోయిందా? ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. కొందరికి స్మార్ట్‌ఫోన్ పోతే ప్రాణం పోయినట్టవుతుంది. ఈ గ్యాడ్జెట్‌ను అంత అపురూపంగా చూసుకుంటారు. అందులో ముఖ్యమైన కాంటాక్ట్స్, ఇమెయిల్, ఫోటోలు, వీడియోలు, ప్రైవేట్ డేటాతో పాటు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుల సమాచారం కూడా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లకు ఫైండ్ మై డివైజ్ ఫీచర్ పూర్తి స్థాయిలో పనిచేయాలంటే మీ స్మార్ట్‌ఫోన్‌లో మొబైల్ డేటా ఆన్ చేసి ఉండాలి. లేదా వైఫై నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉండాలి. లొకేషన్ సెట్టింగ్స్ అంటే జీపీఎస్ ఆన్‌లో ఉండాలి. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఫైండ్ మై డివైజ్ సెట్టింగ్స్ కూడా ఆన్ చేసి ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)