1. ఒకరి పేరు మీద రెండుమూడు జీమెయిల్ అకౌంట్స్ ఉండటం మామూలే. ముందు ఓ జీమెయిల్ అకౌంట్ (Gmail Account) క్రియేట్ చేయడం, ఆ తర్వాత కొత్త ఐడీ క్రియేట్ చేసి పాత అకౌంట్‌ను వదిలేయడం చాలామందికి అలవాటు. అయితే పాత జీమెయిల్ ఐడీ వాడకుండా వదిలేసేవారు ఉంటారు. అయితే వారి గూగుల్ అకౌంట్ (Google Account) యాక్టీవ్‌గా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఒకవేళ ఆ జీమెయిల్ ఐడీతో హ్యాకర్లు లాగిన్ అయ్యారంటే చిక్కులు తప్పవు. చాలావరకు సైబర్ నేరాలకు ఇది కారణమవుతోంది. అందుకే మీరు పాత జీమెయిల్ ఐడీ ఉపయోగించనట్టైతే గూగుల్ అకౌంట్‌ను డిలిట్ చేయాలి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి ప్లాట్‌ఫామ్స్ లాగానే గూగుల్ కూడా యూజర్లు తమ అకౌంట్‌ను డిలిట్ చేసే అవకాశం ఇస్తోంది. మీ గూగుల్ అకౌంట్‌ను పర్మనెంట్‌గా డిలిట్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. మీ గూగుల్ అకౌంట్‌ను డిలిట్ చేయడానికి ముందుగా మీ స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్లో https://www.google.com/account/about/ ఓపెన్ చేయండి. మీ గూగుల్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. హోమ్ పేజీలో Data & Privacy ఆప్షన్ ఓపెన్ చేయాలి. More Options పైన క్లిక్ చేయాలి. Delete your Google account ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)