4. మీరు స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు ఎక్కువగా యాడ్స్ కనిపిస్తున్నాయా? అయితే మీ ఫోన్లో ఏదైనా మాల్వేర్ లేదా యాడ్వేర్ ఉండొచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌లో మీకు తెలియకుండా ఏవైనా యాప్స్ ఇన్స్టాల్ అయ్యాయా? మీ ప్రమేయం లేకుండా కొత్త యాప్స్ స్క్రీన్‌పైకి వస్తున్నాయా? అయితే అనుమానించాల్సిందే. (ప్రతీకాత్మక చిత్రం)
7. మీకు తెలియని నెంబర్ల నుంచి మిస్డ్ కాల్స్ వస్తున్నాయా? అది కూడా ఇంటర్నేషనల్ నెంబర్స్ నుంచి ఎక్కువగా కాల్స్ వస్తున్నాయా? అయితే మీరు అప్రమత్తం కావాల్సిందే. వెంటనే మీ ఫోన్ ఓసారి చెక్ చేసుకోండి. ఇక మీ మొబైల్ డేటా చాలా వేగంగా అయిపోతుందా? ఒక్కసారిగా మొబైల్ డేటా యూసేజ్ పెరిగిపోయిందా? అయితే జాగ్రత్త పడాల్సిందే. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఇక మీరు వాడుతున్న యాప్స్ సడెన్‌గా క్లోజ్ అవుతున్నాయా? పదేపదే ఎర్రర్స్ వస్తున్నారా? మీ ఫోన్ హ్యాక్ అయిందనడానికి ఇది కూడా ఓ ఉదాహరణ. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇలాంటి మార్పులు కనిపిస్తున్నాయంటే మీ ఫోన్ హ్యాక్ అయిందని అనుమానించాలి. సాధారణంగా ఫోన్లో ఇలాంటి సమస్యలు పెద్దగా రావు. తరచూ మీరు ఇలాంటి సమస్యల్ని గుర్తిస్తే మాత్రం జాగ్రత్తపడండి. (ప్రతీకాత్మక చిత్రం)
10. మెమొరీ కార్డ్ తీసేసి అందులో మీకు అవసరమైన ఫైల్స్‌ని వేరే చోట కాపీ చేయాలి. ఆ తర్వాత మీ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. మీ మెమొరీ కార్డులోని ముఖ్యమైన ఫైల్స్ కాపీ చేసిన తర్వాత ఫార్మాట్ చేయాలి. ఇక మీ ఫోన్లో ఏదైనా యాంటీ వైరస్, మొబైల్ ఇంటర్నెట్ సెక్యూరిటీ ఇన్స్టాల్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
11. ఆండ్రాయిడ్ యాంటీవైరస్, మొబైల్ ఇంటర్నెట్ సెక్యూరిటీ ఏడాదికి రూ.100 లోపే కొనొచ్చు. ప్రీమియం వర్షన్ ఇన్స్టాల్ చేస్తే చాలావరకు ఫిషింగ్, హ్యాకింగ్ లాంటి ముప్పు తప్పించుకోవచ్చు. మీకు ఏ యాప్ కావాలన్నా గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి. థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగిస్తే చిక్కులు తప్పవు. (ప్రతీకాత్మక చిత్రం)