1. స్మార్ట్‌ఫోన్ ఎన్నేళ్లకు ఓసారి మార్చాలి? ఈ ప్రశ్నకు సమాధానం ఆ స్మార్ట్‌ఫోన్ యూజర్‌పై ఆధారపడి ఉంటుంది. మార్కెట్లోకి వచ్చే ప్రతీ అప్‌గ్రేడ్ స్మార్ట్‌ఫోన్ (Smartphone Upgrade) వాడాలంటే కేవలం ఆరు నెలల్లోనే మొబైల్ మార్చాల్సి ఉంటుంది. కానీ కాస్త జాగ్రత్తగా వాడుకుంటే రెండేళ్ల వరకు స్మార్ట్‌ఫోన్ బాగానే పనిచేస్తుంది. ఒకటి నుంచి రెండేళ్ల మధ్యలో స్మార్ట్‌ఫోన్ మార్చేవాళ్లు ఉంటారు. అయితే స్మార్ట్‌ఫోన్ ఎప్పుడూ ఇబ్బంది లేకుండా పనిచేయాలంటే అప్డేట్స్ తప్పనిసరి. (ప్రతీకాత్మక చిత్రం)
2. సాఫ్ట్వేర్ అప్డేట్స్తో (Software Updates) పాటు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ముఖ్యం. రెగ్యులర్‌గా సాఫ్ట్వేర్, సెక్యూరిటీ అప్డేట్స్ వస్తే నాలుగేళ్లు కూడా స్మార్ట్‌ఫోన్ చక్కగా వాడుకోవచ్చు. ఒకవేళ ఈ అప్డేట్స్ రాకపోతే మాత్రం రెండేళ్ల తర్వాత స్మార్ట్‌ఫోన్ ఉపయోగించడం కష్టం. మరి ఏ కంపెనీ ఎక్కువకాలం ఈ అప్డేట్స్ అందిస్తోంది? మీరు వాడే స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఎన్నేళ్లపాటు అప్డేట్స్ ఇస్తుంది? తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. Samsung: సాంసంగ్ ఐదేళ్ల వరకు ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తోంది. చాలావరకు సాంసంగ్ స్మార్ట్ఫోన్లకు మూడేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి. అయితే సాంసంగ్ గెలాక్సీ ఎస్21 సిరీస్ స్మార్ట్ఫోన్లకు మాత్రం నాలుగేళ్లు ఆండ్రాయిడ్ అప్డేట్స్, ఐదేళ్లు సెక్యూరిటీ ప్యాచెస్ లభించడం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)
4. Google Pixel: సాఫ్ట్వేర్, సెక్యూరిటీ అప్డేట్స్ అందించడంలో గూగుల్ పిక్సెల్ టాప్ అని చెప్పాలి. గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ కొంటే మూడేళ్లు ఆండ్రాయిడ్ అప్డేట్స్, ఐదేళ్లు సెక్యూరిటీ ప్యాచెస్ లభిస్తాయి. అంటే పిక్సెల్ సిరీస్‌లో వచ్చిన గూగుల్ పిక్సెల్ 2, పిక్సెల్ 2ఎక్స్ఎల్ మోడల్స్ ఇప్పుడు ఔట్‌డేట్ అయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. OnePlus, Oppo: వన్‌ప్లస్ 7 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్ అయినప్పటి నుంచి ప్రతీ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌కు మూడేళ్ల వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్, నాలుగేళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని ప్రకటించడం విశేషం. వన్‌ప్లస్ సిస్టమ్ బ్రాండ్ అయిన ఒప్పో కూడా మూడేళ్ల వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్, నాలుగేళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. Nokia: నోకియా ఎక్స్ సిరీస్ స్మార్ట్ఫోన్లకు మూడేళ్ల ఓఎస్ అప్డేట్స్ లభిస్తే, జీ సిరీస్ స్మార్ట్ఫోన్లకు రెండేళ్ల ఓఎస్ అప్డేట్స్ లభిస్తున్నాయి. ఈ రెండు సిరీస్‌ల స్మార్ట్ఫోన్లకు మూడేళ్ల ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచెస్ ఇస్తోంది కంపెనీ. ఇక సీ సిరీస్ విషయానికి వస్తే రెండేళ్ల క్వార్టర్లీ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తోంది. ఆండ్రాయిడ్ అప్డేట్స్ మాత్రం ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)