1. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ (WhatsApp) ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ యూజర్లకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. సరికొత్త మెసేజింగ్ ఫీచర్లను అందిస్తూ టెలిగ్రామ్, సిగల్న్ వంటి మెసేజింగ్ యాప్స్‌కు అందనంత ఎత్తులో నిలుస్తుంది. అందుకే వాట్సప్‌కు ప్రపంచ వ్యాప్తంగా 5 బిలియన్ యూజర్లు ఉన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. అయితే ఎన్నో స్పెషల్ ఫీచర్లు (WhatsApp Features) అందించిన వాట్సప్‌లో.. మొబైల్ నెంబర్‌ను మార్చుకునే యూజర్లు తమ పాత చాట్ లిస్ట్స్, కీలకమైన డేటాను ఎరైజ్ చేయకుండానే కొత్త నంబర్‌కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే వాట్సప్ యాప్ నుంచి మీ మొబైల్ నెంబర్‌ను మార్చుకున్నా, పాత డేటా అలాగే ఉంటుంది. వాట్సప్ డేటా కోల్పోకుండానే కొత్త నంబర్‌ను ఎలా అప్డేట్ చేసుకోవాలో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
3. ముందు మీ వాట్సప్ యాప్‌ను ఓపెన్ చేసి, సెట్టింగ్స్ ఆప్షన్‌కు వెళ్లండి. అక్కడి నుంచి అకౌంట్స్ సెట్టింగ్స్‌కు వెళ్లి, ఛేంజ్ నంబర్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇక్కడ డిస్ప్లే అయ్యే మొదటి కాలమ్‌లో మీ ప్రస్తుత వాట్సప్ రిజిస్టర్డ్ నంబర్‌ను ఎంటర్ చేయండి. మీరు మారాలనుకుంటున్న కొత్త నంబర్‌ను రెండో కాలమ్‌లో ఎంటర్ చేసి, సబ్మిట్ చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇలా చేస్తే పాత నంబర్‌కు సంబంధించిన చాట్స్, డేటాను తిరిగి పొందవచ్చు. అలాగే మీ వాట్సప్ నంబర్‌ను మార్చుకున్న విషయాన్ని నిర్ణీత కాంటాక్ట్స్‌కు మాత్రమే తెలియజేసే ఆప్షన్ కూడా ఉంటుంది. యూజర్ల ఇష్టప్రకారం ఈ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. మరోవైపు, త్వరలోనే వాట్సప్ తన కస్టమర్ల కోసం కొత్త ఫీచర్లను పరిచయం చేయనుంది. వాటితో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఓసారి పరిశీలిద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
6. వాట్సప్ ‘మెసేజ్ ఎడిట్’ పేరుతో సరికొత్త ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ స్టేజ్‌లో ఉంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు సెండ్ చేసిన తరువాత కూడా మెసేజ్‌ను నిర్ణీత సమయంలోపు ఎడిట్ చేసుకోవచ్చు. అయితే మెసేజ్ పంపిన 15 నిమిషాల లోపు మాత్రమే ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. వాట్సప్ తన సేవలను మరింత విస్తృతం చేయడానికి గ్రూప్ మెంబర్స్ సంఖ్యను పెంచుకునే అవకాశాన్ని త్వరలో కల్పించనుంది. ప్రస్తుతం గరిష్టంగా 512 కాంటాక్ట్స్‌తో మాత్రమే వాట్సప్‌లో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు. అయితే భవిష్యత్‌లో ఈ సంఖ్యను మరింత పెంచనుంది. ఒక గ్రూప్‌లో 1024 మంది సభ్యులుగా చేరే అవకాశాన్ని కల్పించనుంది. (ప్రతీకాత్మక చిత్రం)