1. క్యూఆర్ కోడ్... ఇది ఇటీవల బాగా పాపులర్ అవుతున్న టెక్నాలజీ. కొంత సమాచారాన్ని ఓ కోడ్ రూపంలో భద్రపరిచేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ కోడ్ స్కాన్ చేస్తే అందులో సమాచారం తెలుస్తుంది. క్యూఆర్ కోడ్ అంటే క్విక్ రెస్పాన్స్ కోడ్. ఎక్కడైనా షాపింగ్ చేసినప్పుడు పేమెంట్ చేయడానికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం మామూలే. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇటీవల విజిటింగ్ కార్డులు కూడా క్యూఆర్ కోడ్ రూపంలో వస్తున్నాయి. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అందులోని సమాచారం కనిపిస్తుంది. వాట్సప్ వెబ్ లాగిన్ కావాలాన్నా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి.ఇక పేమెంట్స్ కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డబ్బులు ఆ క్యూఆర్ కోడ్‌కు లింక్ అయిన ఉన్న అకౌంట్లోకి వెళ్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. వ్యాపారుల దగ్గర అమెజాన్ పే, పేటీఎం, ఫోన్‌పే లాంటి పేమెంట్ ప్లాట్‌ఫామ్స్‌కు పేమెంట్ చేయడానికి క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. ఫ్లైట్ టికెట్ డీటెయిల్స్, ఆన్లైన్ ఆర్డర్ ట్రాకింగ్ డీటైల్స్ తెలుసుకోవడానికి కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. ప్రతీ క్యూఆర్ కోడ్ భిన్నంగా ఉంటాయి. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఎలాగో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
4. Camera App: స్మార్ట్‌ఫోన్ కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయొచ్చు. కెమెరాతోనే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ఈజీ. చాలావరకు స్మార్ట్‌ఫోన్ కంపెనీలన్నీ కెమెరా యాప్ లోనే క్యూఆర్ కోడ్ స్కానర్‌ను ఇంటిగ్రేట్ చేస్తున్నాయి. కెమెరా ఓపెన్ చేయడానే క్యూఆర్ కోడ్ ఐకాన్ కనిపిస్తుంది. క్లిక్ చేసి స్కాన్ చేస్తే చాలు. (ప్రతీకాత్మక చిత్రం)