2. పదేళ్ల క్రితం స్మార్ట్‌ఫోన్‌లో కేవలం 192 ఎంబీ ర్యామ్ మాత్రమే ఉందంటే నమ్ముతారా? అంతేకాదు... 3.15 మెగాపిక్సెల్ కెమెరా, 1,150 ఎంఏహెచ్ బ్యాటరీతో ఉండేది ఆ ఫోన్. ఇప్పుడు ర్యామ్ 8 జీబీ, బ్యాటరీ 5000 ఎంఏహెచ్ ఉంటున్నాయి. అంతేకాదు... త్వరలో 12 జీబీ ర్యామ్‌తో స్మార్ట్ఫోన్లు రాబోతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. స్మార్ట్‌ఫోన్ పెర్ఫామెన్స్ బాగుండాలన్నా, మల్టీ-టాస్కింగ్‌లో సమస్యలు రావొద్దన్నా ర్యామ్ చాలా ముఖ్యం. ప్రాసెసర్ ఒక్కటే బాగుంటే సరిపోదు... ర్యామ్ కూడా సరిపడా ఉండాలి. ఒకేసారి మూడునాలుగు యాప్స్ ఓపెన్ చేసినా ర్యామ్ ఎక్కువగా ఉంటే సమస్యలు రావు. కానీ సగటు యూజర్ ఎంత ర్యామ్ ఉన్న ఫోన్ తీసుకుంటే సరిపోతుందో అవగాహన ఉన్నవాళ్లు తక్కువే. (ప్రతీకాత్మక చిత్రం)