1. జోకర్ మాల్వేర్ అనేక యాప్స్‌లో బయటపడుతోంది. ఫ్లీస్‌వేర్ కేటగిరీకి చెందిన జోకర్ మాల్వేర్ స్మార్ట్‌ఫోన్ యూజర్లను దోచుకుంటోంది. యూజర్లకు తెలియకుండా వారి అకౌంట్స్ ఖాళీ చేస్తోంది. సైబర్ సెక్యూరిటీ సంస్థ అయిన Pradeo పలు యాప్స్‌లో జోకర్ మాల్వేర్ను గుర్తించింది. ఆ జాబితాను విడుదల చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. గత వారం సెక్యూరిటీ సంస్థ Pradeo కలర్ మెసేజ్ యాప్‌లో జోకర్ మాల్వేర్ ఉన్నట్టు ప్రపంచానికి తెలిపిన సంగతి తెలిసిందే. ఒక యాప్ కాదు... మొత్తం 7 యాప్స్‌లో ఈ మాల్వేర్ ఉన్నట్టు ప్రకటించింది. ఆ 7 యాప్స్ జాబితాను విడుదల చేసింది. ఇవన్నీ గూగుల్ ప్లేస్టోర్‌లో ఉన్న యాప్సే. మీరు ఈ యాప్స్‌ను ఉపయోగిస్తున్నట్టైతే వెంటనే డిలిట్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
3. లేటెస్ట్గా జోకర్ మాల్వేర్ బయటపడ్డ యాప్స్ ఇవే: Color Message, Safety AppLock, Convenient Scanner 2, Push Message-Texting&SMS, Emoji Wallpaper, Separate Doc Scanner, Fingertip GameBox. వీటిలో కలర్ మెసేజ్ యాప్‌ని 5 లక్షలసార్లు డౌన్లోడ్ చేశారని అంచనా. మొబైల్ సెక్యూరిటీ సొల్యూషన్స్ సంస్థ ప్రాడియో కొంతకాలంగా జోకర్ మాల్వేర్ ఉన్న యాప్స్‌ని గుర్తిస్తోంది. అందులో భాగంగా 7 యాప్స్ జాబితా రిలీజ్ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇక ఇప్పటికే 15 పాపులర్ యాప్స్‌లో జోకర్ మాల్వేర్ బయటపడ్డ సంగతి తెలిసిందే. క్యాస్పర్స్కీకి చెందిన అనలిస్ట్ 14 యాప్స్‌లో జోకర్ మాల్వేర్ను గుర్తించారు. గత ఏడాదిగా జోకర్ మాల్వేర్ చాలా యాప్స్‌లో బయటపడుతోంది. జోకర్ మాల్వేర్ తొలిసారిగా 2017లో బయటపడింది. ఆ తర్వాత వందలాది యాప్స్‌లో ఈ మాల్వర్ కనిపించింది. (ప్రతీకాత్మక చిత్రం)
5. జోకర్ మాల్వేర్ ఓ ప్రమాదకరమైన మాల్వేర్. స్మార్ట్‌ఫోన్ యూజర్ల ప్రమేయం లేకుండా పలు ప్లాట్‌ఫామ్స్‌లో ప్రీమియం సర్వీసులకు, పెయిడ్ సర్వీసులకు సైన్ ఇన్ చేస్తుంది. ఆ తర్వాత యూజర్ల అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అవుతూ ఉంటాయి. ఏం జరిగిందో తెలుసుకునేలోపే అకౌంట్ ఖాళీ అవుతుంది. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే... యూజర్లకు ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే ఓటీపీలను కూడా ఈ మాల్వేర్ గుర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. అంతేకాదు... మీ స్మార్ట్‌ఫోన్‌లో కనిపించే యాడ్స్‌ని మీకు తెలియకుండా క్లిక్ చేస్తూ ఉంటుంది. ఇలా ఇప్పటికే కోట్లాది యూజర్లను జోకర్ మాల్వేర్ టార్గెట్ చేసింది. పలు సెక్యూరిటీ సంస్థలు జోకర్ మాల్వేర్ ఉన్న యాప్స్ జాబితాను ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటాయి. వెంటనే గూగుల్ అప్రమత్తమై ప్లేస్టోర్ నుంచి ఆ యాప్స్‌ని తొలగిస్తూ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. మీరు ఆ యాప్స్ డౌన్లోడ్ చేసి ఉపయోగిస్తున్నట్టైతే మీ స్మార్ట్ఫోన్లోంచి వెంటనే అన్ఇన్స్టాల్ చేయాలి. లేకపోతే ఈ డేంజరస్ మాల్వేర్ మిమ్మల్ని టార్గెట్ చేసే అవకాశం ఉంది. జోకర్ మాల్వేర్ మాత్రమే కాదు... ట్రోజన్ మాల్వేర్ కూడా స్మార్ట్‌ఫోన్ యూజర్ల బ్యాంక్ అకౌంట్, పాస్వర్డ్ లాంటి వివరాలను దొంగిలించి హ్యాకర్లకు చేరవేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)